Rajinikanth lingaa movie release postponed to christmas

rajinikanth lingaa movie release date, rajinikanth lingaa movie release postpone, rajinikanth lingaa photos, rajinikanth latest news updates, rajinikanth lingaa first look trailers teasers, anushka sonakshi sinha in lingaa movie, koliwood latest updates, lingaa post productions works

rajinikanth lingaa movie release postponed to christmas : super star rajinikanth latest movie lingaa in post production works and latest gossip that movie release may late because of post production works late

తలైవా బర్త్ డే గిఫ్ట్ ఉన్నట్టా... లేనట్టా...?

Posted: 11/25/2014 12:10 PM IST
Rajinikanth lingaa movie release postponed to christmas

రజినీకాంత్ ఈ సారి తన అభిమానులకు పుట్టినరోజు కానుక అందించటంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే కోలీవుడ్ వర్గాలు చెప్తున్న ప్రకారం, ఆయన తాజా సినిమా ‘లింగా’ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లింగా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే నిర్మాణంతర పనులు ఆలస్యం అయితే మాత్రం డిసెంబర్ 12కు విడుదల కాదు అని అంటున్నారు.

బర్త్ డే కానుకగా ఈ మూవీ 12న విడుదల కాకపోతే... డిసెంబర్ చివరి వారంలో వచ్చే క్రిస్మస్ పండగ కానుకగా విడుదల అవుతుందని అంటున్నారు. అయితే ముందుగా అనుకున్న తేదికే విడుదల చేయాలని ఎక్కువ సమయం పని చేస్తున్నా.., సీజీ వర్క్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నందు వల్ల సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రజినికాంత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఒకేసారి తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో పాటు, భారీ అంచనాల మద్య ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదిని గతంలో ప్రకటించిన సినిమా యూనిట్ వాయిదాపై మాత్రం స్పందించలేదు. అభిమానులకు పుట్టిన రోజు కానుకగా వస్తుందా లేక.., క్రిస్మస్ కానుకగా వస్తుందా తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  lingaa  release  postponed  koliwood  

Other Articles