Puri jagannath ntr temper movie latest update

temper movie updates, temper movie shooting in goa, temper movie goa shooting photos, temper release date, temper ntr photos, junior ntr kajal in temper movie, temper first look trailers teaser, temper cast and crew, junior ntr next movie name and updates, kajal aggrawal goa latest hot photos, tollywood latest news updates

puri jagannath ntr temper movie latest update : puri jagannath ntr combination movie temper completed shooting in goa on 24th november, temper getting ready to release by sankranti latest news that from 27th november movie shooting will start in ramoji film city

గోపాలుడికి టెంపర్ గట్టి పోటీ ఖాయం

Posted: 11/25/2014 09:58 AM IST
Puri jagannath ntr temper movie latest update

జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘టెంపర్’ గురించి కొన్ని లేటెస్ట్ విషయాలు తెలిశాయి. ఈ సినిమా గోవా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సోమవారం (నవంబర్ 24) రాత్రి షూటింగ్ పూర్తయిందని యూనిట్ వర్గాలు ప్రకటించాయి. మంగళవారం హైదరాబాద్  బయల్దేరుతున్న మూవీ యూనిట్.., తిరిగి నవంబర్ 27నుంచి హైదరాబాద్ లోని రామోజి ఫిలింసిటీలో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

గోవా షూటింగ్ లో ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్ రాజ్ నేపథ్యంగా వచ్చ కీలక సీన్లు షూట్ చేశారట. ఈ సన్నివేశాలు సినిమా కథకు ముఖ్యమైనవని తెలుస్తోంది. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమా.., శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల సమయం ఆదా అయి అనుకున్న టైంకు మూవీ రిలీజ్ అవుతుందని పూరి టీం చెప్తోంది. ఇక మరొక అప్ డేట్ ఏమిటంటే.., ఈ నెలాఖరులో సినిమా పోస్టర్ విడుదల అవుతుందని తెలుస్తోంది. అదేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ టీజర్ విడుదల అవుతుంది.

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ మూవీ కూడా సంక్రాంతి విడుదల కోసం సిద్ధమవుతుండగా.,, ‘టెంపర్’ కూడా పండగ కోసం పనులు పూర్తి చేసుకుంటోంది. ఇక నవంబర్ 28న గోపాలుడి ఫస్ట్ లుక్ అని ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తేది చెప్పకుండా మరో నాలుగు రోజుల్లో అని ఎన్టీఆర్ టీం కూడా ప్రకటించింది. ‘టెంపర్’ ఫస్ట్ లుక్ కూడా 28నే ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. విడుదలకు ముందే ఇలా పోటీ నెలకొనటంతో సంక్రాంతికి వీరి మద్య సమరమే  జరుగనుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper  puri jagannath  ntr  goa  latest news  

Other Articles