Trivikram allu arjun movie release date fixed announced

trivikram allu arjun movie , trivikram allu arjun movie updates, trivikram allu arjun movie release date trivikram allu arjun movie latest photos, nithya menon allu arjun latest movie photos, trivikram allu arjun movie cast and crew, trivikram allu arjun movie title name, tollywood latest movie updates, telugu movies in 2015, telugu movies in 2014

trivikram allu arjun movie release date fixed : allu arjun trivikram latest combination movie busy with shooting to complete in time, here is some of tollywood persons saying that movie will release by february first week of 2015

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ రిలీజ్ డేట్ ప్రకటన

Posted: 11/25/2014 08:17 AM IST
Trivikram allu arjun movie release date fixed announced


మెగా ఫ్యామిల అభిమానులకు శుభవార్త. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా విడుదల తేది వచ్చేసింది. వచ్చే ఏడాది రెండవ నెలలో మొదటి వారంలో సినిమా విడుదల కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2015 పిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీ షూటింగ్ జరుగుతోంది. వీలయితే డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

నగర శివారులోని కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత తొలి  హీరోయిన్ కాగా.., అదాశర్మ, నిత్యా మీనన్ కూడా లీడ్ రోల్స్  పోషిస్తున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, నటి స్నేహ కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి నేపథ్యంగా వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవుతాయని అంటున్నారు.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. త్వరలోనే టైటిల్ ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఇక ‘జులాయి’కి సూపర్ ట్యూన్స్ అందించి మ్యూజికల్ హిట్ అనేలా చేసిన దేవిశ్రీ ఈ సినిమాకు సంగీతం     అదిస్తున్నారు. ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram srinivas  release  tollywood  

Other Articles