Anushka on rajamouli

anushka on rajamouli, anushka in bahubali movie, anushka latest movie updates, anushka photos in bahubali, anushka in rudrama devi, anushka rudramadevi photos and trailers, prabhas rana in bahubali, bahubali latest updates, tolywood laetst news updates

anushka on rajamouli : tollywood star heroine sweety anushka recently responded on bahubali director rajamouli how he is making movies and his observation caring towards a movie

జక్కన్న గురించి యోగా టీచర్ చెప్పిన నిజాలు

Posted: 11/24/2014 10:01 AM IST
Anushka on rajamouli

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గురించి అందాల భామ అనుష్క కొన్ని నిజాలు వెల్లడించింది. కధను, క్యారెక్టర్లను ఎలా ఎంపిక చేసుకుంటాడు. నటుల్లోని టాలెంట్ పై ఆయనకుండే కాన్ఫిడెంట్ల, క్లారిటీ గురించి ఓ ఇంటర్య్వూలో అనుష్క మాట్లాడింది. రాజమౌళి కథ చెప్పే విధానం.., పాత్రలను చూపించే విధానం చాలా కేరింగ్ గా ఉంటుందని చెప్పింది. అదేవిధంగా నటుల్లో తన పాత్రకు కావాల్సిన విషయంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడని వెల్లడించింది. నటుల్లో ఏ టాలెంట్ ఉంది.. వారి నుంచి తనకు కావాల్సిన టాలెంట్ ఎలా రాబట్టుకోవాలో సర్ కు బాగా తెలుసు అని మెచ్చుకుంది.

ఇక జక్కన్న డైరెక్షన్ లో తాజాగా నటిస్తున్న ‘బాహుబలి’ సినిమాపై కూడా యోగా టీచర్ స్పందించింది. ఈ సినిమా విషయంలో చాలామంచి టెక్నిషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, డిజైనింగ్ టీంతో కలిసి పనిచేస్తున్నాను అని వెల్లడించింది. ఉత్తములతో పనిచేసే మంచి అవకాశం ‘బాహుబలి’ వల్ల వచ్చిందని చెప్తోంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా ఇంటెన్స్ గా ఉంటుందని వెల్లడించింది. ‘బాహుబలి’ షూటింగ్ లో ఉన్నంత సమయం ఏదో ఒక కొత్త విషయం, అంశం తెలుస్తుంది, కొత్తగా ఏదో నేర్చుకున్నాము అనే తృప్తి కలుగుతుందట.

భారత సినీ ఇండస్ర్టీలోనే ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటిగా ఉన్న ‘బాహుబలి’ని రాజమౌళి రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పార్ట్ 2015 ఎప్రిల్ 17న విడుదల అవుతుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా వస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మిల్కీ బ్యూటి తమన్నా లీడ్ రోల్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణమవుతోంది. ఇక అనుష్క విషయానికి వస్తే.., ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటు తమిళంలో రెండు సినిమాలు ఉన్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  rajamouli  bahubali  prabhas  latest news  

Other Articles