Pawan kalyan shows new styles in gabbar singh2 movie

gabbar singh2 movie latest updates, pawan kalyan new style and look in gabbar singh2, pawan kalyan photos in gabbar singh2 movie, gabbar singh2 movie cast and crew, gabbar singh2 movie second heroine, gabbar singh2 anisha ambrose photos, gabbar singh2 shooting photos, gopala gopala release date, pawan kalyan latest movie updates, tollywood latest news updates

pawan kalyan shows new styles in gabbar singh2 movie : first tollywood hero to show new styles in movies pawan kalyan again coming with a new style and look in his upcoming gabbar singh2 movie. gabbarsingh movie will directed by bobby and movie cast and crew till revealed soon

గబ్బర్ సింగ్ 2 అప్ డేట్స్ : ఈ సారీ ట్రెండ్ చేస్తాడట

Posted: 11/22/2014 08:12 AM IST
Pawan kalyan shows new styles in gabbar singh2 movie

‘నేను ట్రెండ్ ఫాలో కాను.. సెట్ చేస్తాను’ అనే పవన్ డైలాగ్ ఆయన సినిమాలాగే హిట్ అయింది. పవర్ స్టార్ నిజంగానే ఒక విషయంలో ట్రెండ్ సెట్టర్.  టాలీవుడ్ లో కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ చూపించే హీరోల్లో ముందుండేది పవన్ మాత్రమే. ఖుషి బ్యాగ్స్, బాలు ప్యాంట్, హెయిర్ స్టయిల్ ఇలా ప్రతి ఒక్కటి పవన్ సమ్ థింగ్ స్పెషల్ లా చూపిస్తాడు. అలా ఆయన సినిమాల్లో ఉపయోగించే డిఫరెంట్  డ్రెస్సెస్ కు ప్రతిసారీ విపరీతమైన క్రేజ్ వస్తుందన్న విషయం తెలిసిందే. మరోసారి ఇదే హిస్టరీ రిపీట్ చేసందుకు పవర్ స్టార్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం.

త్వరలో తెరకెక్కనున్న ‘గబ్బర్ సింగ్2’ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్ తో కన్పిస్తాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొత్త లుక్ తో పాటు, మ్యానరిజం కూడా గబ్బర్ సింగ్ కంటే హైలైట్ గా ఉంటుందని అంటున్నాయి. ఇక డ్రెస్సింగ్ స్టయిల్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో మాస్ పోలిస్ గా.., మెడలో చిన్నపాటి ఎర్రటి టవల్ వేసుకుని సంచలనం సృష్టించాడు. పోలిస్ అంటే ఇలా కూడా ఉంటారు అని ఆ సినిమాతో చెప్పాడు. ఈ మూవీలో పోలిస్ డ్రెస్ వేసుకోవటంతో ఫ్యాన్స్ వాటిని ప్రయోగించలేకపోయారు. అయితే మెడలో వేసుకున్న కర్ఛీఫ్ మాత్రం పాపులర్ అయి ఫ్యాన్స్ జేబుల్లో.. చేతుల్లో స్టైల్ గా ఉంటోంది.

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గబ్బర్ సింగ్2’ మూవీ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం అవుతుంది. పవన్ సొంతంగా రాసుకున్న ఈ ప్రాజెక్టును బాబీ తెరకెక్కించనున్నాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీస అంబ్రోస్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మూవీలో సెకండ్ హీరోయిన్ ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. గ్లామర్ రోల్ కోసం సెకండ్ హీరోయిన్ ను ఉపయోగిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్2’ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అందిస్తాము.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbar singh2  pawan kalyan  style  tollywood  

Other Articles