Asin asks south india film personalities to give a chance

asin hindi movies, asin request to south industry stars, asin whatsapp message to tollywood stars, asin whatsapp message to film stars, asin asking movie chances, asin in bollywood movies, asin movies latest updates, tollywood latest news updates, koliwood latest updates

asin asks south india film personalities to give a chance : heroine asin asking south india film industry directors and producers to give a chance in movies, no movies in bollywood for asin as a result she is depending on south industry again

అల్లం బెల్లమయింది.. అడుక్కుంటోంది

Posted: 11/21/2014 02:38 PM IST
Asin asks south india film personalities to give a chance

కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన అమ్మడు కళ్ళు తెరుచుకుంది. ఒకప్పుడు ఛీ కొట్టినవారినే ఇప్పడు ప్లీజ్ అంటూ బ్రతిమిలాడుతోంది. గతంలో వద్దు అనుకున్న ప్రాజెక్టుల కంటే తక్కువ రేంజ్ అయినా పర్లేదు పని ఇప్పించండి అంటూ బ్రతిమిలాడుకుంటోంది. ఇది ప్రస్తుతం హీరోయిన్ అసిన్ చేస్తున్న పని. టాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం.., ఈ భామ ఈ మద్య పలువురు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు ఇతర ప్రముఖులకు వాట్సాప్ లో మెసేజ్ లు పెడుతోందట. ఒక్క టాలీవుడ్ ఏమిటి సౌత్ లోని మిగతా ఇండస్ర్టీలకు కూడా మొబైల్ నుంచి మెసేజ్ లు వెళ్తున్నాయట.

తనకు ఉన్న  కాంటాక్ట్ లను ఉపయోగించుకుంటూ, సినిమా చాన్స్ ఇవ్వాలని కోరుతుందని తెలుస్తోంది. గతంలో సౌత్ లో అసిన్ ఓ వెలుగు వెలిగింది. గజిని సినిమా తర్వాత ఈ అమ్మడి దశ తిరిగింది. ఈ మూవీ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇంకేముంది... ఇండస్ర్టీని ఏలుదాం అంటూ ఏవేవే కలలు కనేసి తట్టాబుట్టా సర్దేసుకుని హింది ఇండస్ర్టికి వెళ్ళింది. కొత్త మోజులో ఓ నాలుగు సినిమాలు ఇచ్చారు. ఈ సమయంలో మా సినిమాలు చేసిపెట్టండి అంటూ పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సహా సౌత్ ఇండస్ర్టీ ప్రముఖులు ఆసిన్ ను కలిశారు. అయితే అప్పటివరకు బెల్లంగా ఉన్న సౌత్ ఒక్కసారిగా అల్లమైంది. ఛీ.... సౌతా నేను అంత చీప్ సినిమాలు చేయను అని తెగేసి చెప్పిందట. ఏం చేస్తారు నీ.., టైం నడుస్తుంది కాని అనుకుని వెనక్కి వచ్చి మరొకరితో సినిమాలు తీసుకున్నారు.

ఇదే సమయంలో బాలీవుడ్ కు హీరోయిన్ల వరద పెరగటంతో వడపోత మొదలు పెట్టారు. ఈ దెబ్బతో అమ్మడికి సినిమా చాన్సులు తగ్గాయి. నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ చాన్సులు రాలేదు. దీంతో చేసిన తప్పు తెలుసుకుంది. మళ్ళీ సౌత్ దిక్కు అంటూ మెల్లగా బాట పట్టింది. చాన్స్ ఇస్తే సినిమాలో నటిస్తాను అంటూ దక్షిణాదిన ఉన్న సినిమా హీరోలు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖులకు వాట్సాప్ తో రిక్వస్టులు పంపుతుందట. గత పరాభవం మర్చిపోని వారు రిప్లై ఇవ్వటం లేదని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asin  tollywood  bollywood  koliwood  movie offers  latest news  

Other Articles