Heavy budget set for raviteja kick2 movie

ravi teja kick2 movie latest update, ravi teja kick2 movie shooting photos, ravi teja kick2 movie heavy budget set, ravi teja and rakul preet singh in kick2 movie, tollywood latest movie, kalyan ram on kick2movie, kick2 movie cast and crew, kick2 movie release date, pataas movie updates, kalyan ram in pataas movie, pataas release date

heavy budget set for raviteja kick2 movie : kick2 movie is busy with shooting and presently movie unit shifted to city outskirt area rajendra nagar for shooting in a big set worth 2crore rupees

మాస్ హీరోకు బాగా పెడుతున్నాడు

Posted: 11/20/2014 01:36 PM IST
Heavy budget set for raviteja kick2 movie

మనసుపడ్డ వారి కోసం ఏమైనా చేయగలం.. ఎంత ఖర్చయినా పెట్టగలము. ఈ విషయాన్ని హీరో కమ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ మరోసారి నిరూపిస్తున్నాడు. రవితేజ తాజాగా నటిస్తున్న ‘కిక్2’ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాత అని తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నగర శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ లో షూట్ అవుతోంది. రాజస్థాన్ లోని ఓ గ్రామం నేపథ్యంగా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్రామం పరిసరాలు, వాతావరణంతో రాజేంద్రనగర్ లో భారీ సెట్ వేసినట్లు సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ సెట్ కోసం రూ.2కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా భారీ సెట్ వేసి అందులో రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారట. ఖర్చుకు ఏమాత్రం వెనకాడబోనని ప్రకటించిన కళ్యాణ్ రామ్ హిట్ కొడుతుందనే నమ్మకంతోనే ఇంతలా డబ్బు వెచ్చిస్తున్నాడని తెలుస్తోంది. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్ తో పాటు, డైరెక్టర్, కధపై కళ్యాణ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడని మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లా నిలిచిన ‘కిక్’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘కిక్2’ను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ‘రేసుగుర్రం’ మూవీ తర్వాత మరో హిట్ కొట్టాలనే కసితో సురేందర్ పనిచేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kick2  ravi teja  kalyan ram  set  shooting  

Other Articles