Legendary hero kamal hassan writing movie story for sridevi

kamal hassan, kamal hassan latest news, kamal hassan interview, kamal hassan press meet, kamal hassan movies, sridevi, sridevi news

legendary hero kamal hassan writing movie story for sridevi

శ్రీదేవిపై కథలు అల్లుతున్న కమల్ హాసన్!

Posted: 11/01/2014 04:28 PM IST
Legendary hero kamal hassan writing movie story for sridevi

లోకనాయకుడు కమల్ హాసన్, అలనాటి అతిలోకసుందరిగా పేరొందిన శ్రీదేవిల మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధమే వుంది. మొదట చిత్రపరిశ్రమ ద్వారా కలిసిన వీరిద్దరూ... 70, 80 దశకాల్లో దాదాపు 23 చిత్రాల్లో కలిసి నటించి, హిట్ పెయిర్ గా గుర్తింపుపొందారు. అప్పట్లో తమిళంలో వీరిద్దరు కలిసి నటించిన ఆఖరి చిత్రం ‘‘మూండ్రమ్ పిరాయ్’’ (తెలుగులో వసంత కోకిల) సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే తెలుగులో ఆఖరిగా ‘‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’’ అనే సినిమాలో నటించారు. 1986లో రిలీజైన ఈ చిత్రం తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ ఇంతవరకు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. అప్పటినుంచి వీరికి సంబంధించిన వార్తలు కూడా ఎక్కువగా రాలేదు. పైగా వీరిద్దరు కలిసిన దాఖలాలు కూడా లేవు. అయితే తాజాగా కమల్ హాసన్ ఆమె మీద కథలు అల్లుతున్నారనే సమాచారాలు వెలువడుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే... ఇటీవల చాలా సందర్భాల్లో కమల్ తనకు శ్రీదేవితో కలిసి నటించాలనుందని ఎన్నోసార్లు పేర్కొన్నారు. గతేడాది, శ్రీదేవి ‘‘ఇంగ్లిష్ వింగ్లీష్’’తో వెండితెరపై గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో కమల్ ఆమెతో మళ్లీ కలసి నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన ఆమెతో కలిసి మళ్లీ నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని.. ఈ విషయాన్ని ఆమెక్కూడా తెలిపానని కమల్ తెలిపారు. తామిద్దరం కలిసి నటించడం కోసం స్వయంగా తాను ఓ కథను కూడా ప్రస్తుతం రాస్తున్నానని ఆయన కోలీవుడ్ మీడియాకు తెలిపారు. స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే, శ్రీదేవిని సంప్రదిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ శ్రీదేవి, కమల్ చెప్పిన స్ర్కిప్ట్ కు ఓకే చెబితే 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరముందు కనువిందు చేసి.. ప్రేక్షకులను సంతోషపెట్టనున్నారన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  sridevi  kollywood news  tollywood news  telugu news  

Other Articles