Kalyan ram remakes balakrishna rowdy inspector song for pataas

patas movie latest news, patas release date, kalyan ram photos in patas, balakrishna latest movie, balakrishna next movie, kalyan ram remakes balakrishna song, nandamuri family heros, tollywood latest updates, rowdy inspector movie

kalyan ram remakes balakrishna rowdy inspector song for pataas : nandamuri family hero kalyan ram latest movie patas will be with balakrishna song. kalyan ram remakes balakrishna arey o samba song from rowdy inspector movie for his pata movie

బాబాయ్ ను అబ్బాయ్ బాగానే వాడేసుకుంటున్నాడు

Posted: 10/31/2014 12:18 PM IST
Kalyan ram remakes balakrishna rowdy inspector song for pataas

పాత సినిమా కథల పేర్లు కొత్త సినిమాలకు పెట్టడం సాధారణం అయిపోయింది. అదేవిధంగా పాత కధలను కలర్ చేసి సినిమాలు చేయటం మామూలైంది. అంతేకాదు పాత పాటలను రీమేక్ చేయటం కూడా అలవాటైపోయింది. ఇప్పడు కళ్యాణ్ రామ్ ఇదే చేస్తున్నాడు. ఇందుకోసం వారిని వీరిని ఎందుకని బాబాయ్ బాలకృష్ణను ఎంచుకున్నాడు. బాలయ్య సినిమాలోని పాటను తన తాజా చిత్రం ‘పటాస్’ లో వాడుకుంటున్నట్లు సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. బాలకృష్న నటించిన ‘రౌడి ఇన్ స్పెక్టర్’ సినిమాలో ‘అరె ఓ సాంబా’ అనే పాటను రీమేక్ చేస్తున్నారు.

పాత పాటలోని మాధుర్యం, క్రేజ్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుని రీమేక్ చేస్తున్నారట. అయితే ఈ పాటను ఐటం సాంగ్ గా పెడతారా లేక.. సినిమాలో భాగంగా మామూలు పాటగా జత చేస్తారా అనేది ఇంకా బయటకు చెప్పటం లేదు. ‘రౌడి ఇన్ స్పెక్టర్’ సినిమాలో బాలకృష్ణ పోలిస్ క్యారెక్టర్ లో నటించారు. ‘పటాస్’ మూవీలో కూడా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలిస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ మద్యే దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది.

 కళ్యాణ్ రామ్ సొంత సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. 90శాతం షూటింగ్ పూర్తయింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగితే షూటింగ్ మొత్తం ముగిసినట్లే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అందిస్తాము. ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ రీమేక్ చేసే బాలయ్య ‘అరే ఓ సాంబా’ పాటను చూడండి

 

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : patas  kalyan ram  balakrishna  latest movie  

Other Articles