Movies to release for sankranti 2015

telugu movies in 2015, telugu movies in 2015, tollywood latest updates, pawan kalyan gopala gopala movie latest, ntr puri jagannath movie latest update, gopala gopala release date, ram pandaga chesko movie release date, pandaga chesko movie updates, sankranti in andhrapradesh

movies to release for sankranti 2015 : tollywood stars now busy in acting for big projects, all are set to release their movies for sankranti 2015. presently all big projects in tollywood is on production leval only. they all getting ready for sankranti

సంక్రాంతికి సిద్ధమవుతున్న సినిమాలివే....

Posted: 10/30/2014 12:51 PM IST
Movies to release for sankranti 2015

సంక్రాతి వచ్చిందంటే తెలుగు ముంగిళ్ళలో సంబరాలు వెల్లివిరుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో పెద్దపండగగా నిర్వహించే సంక్రాంతి కోసం పెద్ద సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అభిమానులకు పండగ కానుకగా సినిమాలు ఇచ్చేందుకు స్టార్లంతా కష్టపడుతున్నారు. కొన్ని సినిమాలు సరిగ్గా సంక్రాంతికి సిద్ధం అవుతుంటే మరికొన్ని మాత్రం ముందే రెడి అవుతున్నా.. పండగ ముహూర్త బలం కోసం వెయిట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇంతకీ సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలేంటో ఓ సారి చూద్దాం.

పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ‘గోపాల గోపాల’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కన్పిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనుంది. బాలీవుడ్ లో ‘ఓ మై గాఢ్’ సినిమాకు స్వల్ప మార్పులు చేసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పవన్ ఇందులో హీరో క్యారెక్టర్ పోషించకపోయినా.., ఆయనకున్న పాపులారిటీతో ‘గోపాల గోపాల’ అంటే పవన్ సినిమా అని ముద్ర పడిపోయింది. నవంబర్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట. ఇక ఫిలింనగర్ లో అనుకుంటున్న ప్రకారం సంక్రాంతికి ముందుగా 2015 జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న కొత్త ప్రాజెక్టు కూడా పొంగల్ పండక్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆంధ్రావాలా’ తర్వాత ఎన్టీఆర్- పూరీ కాంబినేషన్ లో ఈ మూవీ వస్తోంది. పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ కన్పించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లను వేగంగా పరిగెత్తించటం డైరెక్టర్ పూరికి అలవాటే కదా అందుకే త్వరగా కంప్లీట్ అవుతుందట. ఆ తర్వాత డిసెంబర్ చివరినాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. అప్పటి నుంచి ప్రమోషన్లు, ఆడియో లాంచ్ లు చేసుకుంటూ జనవరిలో ప్రేక్షకులకు పోలిస్ ను పరిచయం చేస్తారట. ఇంకా పేరు ప్రకటించని ఈ సినిమా బహుశా 2015 జనవరి 9న విడుదల అవుతుందని అంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.., బండ్ల గణేష్ నిర్మాతగా ఉన్నారు.

మరోవైపు రామ్ హీరోగా వస్తున్న ‘పండగ చేస్కో’ మూవీ కూడా అభిమానులకు పండగ కానుకగా వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపిచంద్ మాలినేని డైరెక్ట్ చేస్తున్నారు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. జగపతి బాబు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ముందుగా నవంబర్ మధ్యలో వస్తుంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల రెండు నెలలు ఆలస్యంగా సరిగ్గా సంక్రాంతి రోజున అంటే 2015 జనవరం 15న విడుదలకానుంది. ఇవండి సంక్రాంతి పండగ పోటిలో ఉన్న తెలుగు సినిమాలు. వీటికి తోడు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు కూడా తోడయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala  ntr  puri jagannath  ram  latest news  

Other Articles