Mohanbabu yamaleela movie release date confirmed

mohanbabu next movie, mohan babu yamaleela2 movie latest updates, mohan babu yamaleela2 release date, yamaleela2 photos, mohan babu movies, tollywood latest updates, telugu movies in 2014

mohanbabu yamaleela movie release date confirmed : collection king mohan babu latest movie yamaleela 2 going fast with post porduction works to release in noverber last week. mohanbabu latest yamaleela2 movie release date confirmed by novermber 28

మోహన్ బాబు లీలలు బయటకొస్తున్నాయి

Posted: 10/30/2014 12:00 PM IST
Mohanbabu yamaleela movie release date confirmed

కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న డా.మోహన్ బాబు తాజా సినిమా ‘యమలీల2’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ చివర్లో విడుదల అయ్యేందుకు సినిమా సిద్ధమవుతోంది. మంచు ఫ్యామిలి సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ మూవీ నవంబర్ 28న విడుదల అవుతుందని చెప్తున్నారు. విడుదల తేదీకి నెలరోజులే గడువు ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచుతున్నట్లు తెలుస్తోంది.

దశాబ్దం క్రితపు దర్శకుడు, ఫ్యామిలి సినిమాల దిగ్గజం ‘ఎస్వీ కృష్ణారెడ్డి’ తాను తీసిన ‘యమలీల’నే మళ్ళీ ఇన్నాళ్ళకు ‘యమలీల2’ గా సీక్వెల్ తీస్తున్నాడు. ఆ కథలో కైకాల సత్యనారాయణ యముడి పాత్ర పోషిస్తే.., తాజా ప్రాజెక్టులో మోహన్ బాబు యముడిగా కన్పించనున్నారు. గతంలో ‘యమదొంగ’ సినిమాలో యమ క్యారెక్టర్ వేసిన అనుభవం బాబుకు ఉంది. ఇక నాటి చిత్రగుప్తుడే ఈ సినిమాలో కూడా చిట్టా రాస్తున్నాడు. ఆయనే బ్రహ్మానందం. ఈ మూవీతో డాక్టర్ కె.వి. సతీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇక దియా నికోలస్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మంచు మనోజ్, మంచు విష్ణుతో పాటు కూతురు మంచు లక్ష్మి కూడా సినిమాల్లో సెటిల్ అయింది. అయినా కూడ మోహన్ బాబుకు ఇంకా ఫ్యాన్స్ క్రేజ్ తగ్గలేదు. ఆయనకున్న ఆదరణే ఇంకా ఆఫర్లు ఇస్తోందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ఈ సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి మరోసారి తానేంటే చూపించాలని కసిగా ఉన్నాడు. మరి నవంబర్ 28న వచ్చే ‘యమలీల2’లో మోహన్ బాబు లీలలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక మరో విషయం ఏమిటంటే ఈ మద్యే మూవీ పాటలు  విడుదల అయ్యాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohan babu  yamaleela2  tollywood  latest news  

Other Articles