Sruti hassan is heroine in mahesh koratala movie

mahesh babu next movie, mahesh babu movie with koratala shiva, mahesh babu latest updates, sruti hassan mahesh babu movies, sruti hassan next movie, tollywood latest news, telugu latest updates, koratala shiva next movie

sruti haasan is heroine in mahesh koratala movie : glamarous girl sruti hasan is selected for prince mahesh babu latest movie with koratala shiva. tollywood fans waiting for mahesh babu latest movie and here is a talk that prince pairing with sruti for latest project

మహేష్ సినిమాకు ఓకే చెప్పిన స్పందన

Posted: 10/30/2014 10:56 AM IST
Sruti hassan is heroine in mahesh koratala movie

టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తెలుగమ్మాయిలు తెగ కలవరించే కలల రాకుమారుడి పక్కన కన్పించాలని ప్రతి హీరోయిన్ కు ఉంటుంది. అలాంటి అవకాశం వస్తే ఎవరైనా వదులుకోరు కదా. కమల్ కూతురు శృతి కూతురు కూడా అదే చేసింది. మహేష్ త్వరలో చేయబోయే కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పింది. తెలుగులో ప్రస్తుతానికి పెద్ద ప్రాజెక్టులు ఏవి లేకపోవటంతో ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులకు దగ్గర కావటంతో పాటు కాల్షీట్లు నింపేయాలని చూస్తోంది.

‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శృతి కలువ కళ్ళ భామగా మనసు దోచుకుంది. అయితే మొదట్లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ కావటంతో ఐరన్ లెగ్ అనుకున్నారు. కానీ ‘గబ్బర్ సింగ్’, ‘బలుపు’ ‘రేసుగుర్రం’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తానేంటే నిరూపించుకుంది. డబ్బింగ్, పాటలు పాడటం ఇలా మల్టీ టాలెంట్ ఉన్న గ్లామరస్ గర్ల్ శృతి. మిల్కీ బ్యూటీలా ఉండే ఈ అమ్మడు, మిల్క్ బాయ్ లాంటి మహేష్ తో నటిస్తే.., ఫ్యాన్స్ కు పండగే అని అంటున్నారు.

‘ఆగడు’ తర్వాత విరామం తీసుకున్న మహేష్ మళ్ళీ., నవంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఇది భారీ బడ్జెట్ సినిమా అని టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది. అయితే ‘ఆగడు’ రిజల్ట్ తర్వాత మహేష్ ఎక్కువ డబ్బులు ఖర్చపెట్టి సినిమాలు తీయవద్దనీ.., ప్రాస, పంచ్ డైలాగులు తగ్గించాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయం తన సినిమాల నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ ను ప్రిన్స్ చెప్పిన బడ్జెట్ లో ఎలా తీస్తారో చూడాలి. ఇక షూటింగ్ మొదలు పెట్టడంతోనే మహారాష్ర్టలోని పూణేలో షూటింగ్ జరుగుతుంది అని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  sruti hassan  koratala shiva  latest news  

Other Articles