Venkatesh character in gopala gopala movie

gopala gopala release date, gopala gopala latest news, venkatesh in gopala gopala, gopala gopala latest photos, venkatesh with gopala gopala, pawan kalyan latest movies, pawan kalyan and venkatesh movie, tollywood latest news, ramoji film city

venkatesh character shooting in gopala gopala movie : victory venkatesh latest movie gopala gopala shooting in progress, now its shooting in ramoji film city

ఫిలింసిటీలో భూకంపం... చిక్కుకున్న వెంకటేష్

Posted: 10/29/2014 05:02 PM IST
Venkatesh character in gopala gopala movie

రామోజి ఫిలింసిటీలో వచ్చిన భూకంపంలో విక్టరీ వెంకటేష్ చిక్కుకుపోయారట. ఈ ప్రమాదం నుంచి రక్షించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమయ్యాడు అని ఫిలింసిటి వర్గాలు చెప్తున్నాయి. ఈ సీన్ చాలా చక్కగా వచ్చిందట. కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంది కదా. పూర్తి వివరాలు చూస్తే వెంకటేష్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మూవీలో భూకంపం వచ్చే సీన్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసినట్లు తెలుస్తోంది.

ఈ సీన్ లో వెంకటేష్ భూకంపంలో చిక్కుకుపోగా.., పవన్ కృష్ణుడిలా వచ్చి హీరోను కాపాడుతాడు అని చెప్తున్నారు. ఈ సీన్ లో వెంకటేష్, .పవన్ తో పాటు శ్రియ కూడా నటిస్తుంది అని తెలుస్తోంది. సినిమా కథను చూస్తే.., ఓ షాప్ ఓనర్ గా ఉండే వెంకటేష్ కు కష్టాలు చుట్టుముడతాయి. తనకు వచ్చిన సమస్యలకు దేవుడే కారణం అని విమర్శిస్తుండగా.., మరోవైపు శ్రియ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ తన భర్తను కాపాడాలని కోరుతుంది. ఈ భక్తికి మెచ్చిన కృష్ణుడు పవన్ రూపంలో ప్రత్యక్షం అయి సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది సినిమా కధ.

బాలీవుడ్ ‘ఓ మై గాడ్’కు ఇది తెలుగు రీమేక్. కిషోర్ కుమార్ పార్ధసాని నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు-శంకర్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ‘గోపాల గోపాల’ విడుదల అవుతుంది అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకటేష్ కు ఇది రెండవ మల్టీ స్టారర్ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  venkatesh  pawan kalyan  latest news  

Other Articles