Pawan kalyan says no to kaththi telugu remake

pawan kalyan on kaththi movie, kaththi telugu release date, kaththi telugu remake, kaththi movie collections, kaththi telugu dubbing movie release date, cases on kaththi movie, cases on vijay murugadas, tollywood latest news

pawan kalyan says no to kaththi telugu remake : power star pawan kalyan concludes discussion on kaththi telugu remake talk by saying no to act in the movie. pawan kalyan watches kaththi movie on tuesday and decides that not to act in that movie

బ్రేకింగ్ : ‘కత్తి’ రీమేక్ కు పవన్ నో...! కారణాలివే..!!

Posted: 10/29/2014 03:52 PM IST
Pawan kalyan says no to kaththi telugu remake

‘కత్తి’ తెలుగు రీమేక్ పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ అంశంపై కొన్ని రోజులగా వస్తున్న ఊహాగానాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగింపు పలికినట్లు స్పష్టం అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..., ఈ సినిమా రీమేక్ చేయనవసరం లేదు అని పవన్ భావిస్తున్నారు. రీమేక్ పై ఆసక్తి కనబర్చిన పవన్.., తాజా కోర్టు వివాదం నేపథ్యంలో పునరాలోచనలో పడ్డాడు. సినిమా చూసి డిసైడ్ అవుదామని భావించి, మంగళవారం రోజు ప్రత్యేకంగా సినిమాను చూశాడు. ఆ తర్వాత ఈ సినిమా రీమేక్ వద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది.

ముందుగా పవన్ ఆసక్తి కనబర్చటంతో ‘కత్తి’ నిర్మాత కూడా రీమేక్ హక్కులు అమ్మేందుకు ముందుకు వచ్చాడు. తెలుగులో ఠాగూర్ మధు ఈ ప్రాజెక్టు హక్కులు సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మధు, పవన్ కలిసి సినిమా చూశాక అంత అవసరం లేదు అనుకున్నారట. రీమేక్ నో చెప్పటంతో ప్రస్తుతం డబ్బింగ్ వర్షన్ విడుదల చేసే పనిలో సినిమా యూనిట్ బిజీగా ఉంది. ఈ నెల 23నే పాటలు విడుదలై, 31న మూవీ తెలుగు డబ్ బయటకు రావాల్సింది. అయితే పవన్ రీమేక్ ఊహాగానాలతో వాయిదా పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో పాటలు విడుదల చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ముందుగా ఈ సినిమా చేయటానికి ఆసక్తి చూపిన పవన్.. ఆ తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు అని ఆరా తీస్తే పలు గుసగుసలు విన్పిస్తున్నాయి. అందులో ఒకటి మూవీపై ప్రస్తుతం ఉన్న కేసు అని చెప్పవచ్చు. 2జీ కుంభకోణంపై సినిమాలో సన్నివేశాలు ఉండటంతో దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగులో సినిమా తీస్తే పవన్ కు కూడా నోటిసులు వచ్చి అదో తలనొప్పిగా మారుతుంది. ఇక రెండవది ప్రధానమైనది ఏమిటంటే ‘కత్తి’ తెలుగులో గతంలో వచ్చిన సినిమాలకు దగ్గరగా ఉండటం అని తెలుస్తోంది.

‘కత్తి’ కధను ఓ సారి పరిశీలిస్తే... రైతులు సెజ్ మద్య జరిగే వివాదంను ఒక యువకుడు ఎలా పరిష్కరించాడు అనేది పూర్తి సినిమా. రైతుల భూమిని సెజ్ ల పేరుతో కంపనీలు ఎలా లాగేసుకుంటున్నాయి. ఫలితంగా రైతులకు కలిగే నష్టాలు, ప్రకృతికి ఇబ్బందులు ఇతర కోణాలను ఇందులో చూపారు. ఇవి గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో వచ్చిన కధాంశాలే. కాబట్టి ఊహించినంత కొత్తగా ఏమి లేకపోవటంతో ఈ సినిమా రీమేక్ తో ఆశించినంత స్పందన ఏమి రాదు అని భావించినట్లు తెలుస్తోంది. అందువల్లే తెలుగు రీమేక్ పై పవన్ ఆసక్తి చూపలేదు అని అంటున్నారు. అయితే ఈ ఊహాగానాలపై క్లారిటీ మాత్రం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  pawan kalyan  tollywood  latest news  

Other Articles