Sonakshi sinha to start kratos entertainment productions with her brothers luv and kush sinha

sonakshi sinha, sonakshi sinha latest news, sonakshi sinha hot photo shoot, sonakshi sinha latest movies, sonakshi sinha kratos entertainment productions, sonakshi sinha topless photos, luv sinha news, kush sinha news

sonakshi sinha to start Kratos Entertainment productions with her brothers luv and kush sinha

సోనాక్షీ కూడా బిజినెస్ రంగంలో దూరిందట!

Posted: 10/25/2014 12:39 PM IST
Sonakshi sinha to start kratos entertainment productions with her brothers luv and kush sinha

సోనాక్షీ సిన్హా.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ మాంచి డిమాండ్ మీదున్న నటి! మంచి ఫిజిక్ తోపాటు ఎంతో అందంగా కనువిందు చేసే ఈ అమ్మడు.. ఇప్పటికే తన మంత్రాన్ని బాలీవుడ్ మొత్తం వ్యాపింపజేసింది. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు ఖచ్చితంగా రిలీజవుతాయి. పైగా రెమ్యునరేషన్ కూడా భారీమొత్తంలోనే తీసుకుంటోంది. అగ్రకథానాయికలను సైతం వెనుకనెట్టేసి వరుసగా ఆఫర్లు దండేసుకుంటోంది. అయినా ఈ అమ్మడికి సంపాదనలో తృప్తి అంతగా లేదనిపిస్తోంది.. అందుకే బిజినెస్ రంగంలో అడుగులు వేసిందనే ప్రచారాలు ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే ప్రచారాలు కొనసాగుతున్నాయి. ‘‘షాట్ గన్’’ శతృఘ్నసిన్హా వారసురాలిగానే కాకుండా చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అనతికాలంలోనే సొంతం చేసుకున్న ఈ అమ్మడికి... అసలు బిజినెస్ రంగంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందోనంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే... శతృఘ్న సిన్హా లాంటి స్టార్ యాక్టర్ కుటుంబం నుంచి వారసత్వాన్ని పునికితెచ్చుకోవడంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో రంగప్రవేశం సులభం అయ్యింది. అడుగుపెట్టిన మొదటిసినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో రాత్రికిరాత్రే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ.. ఆమె సోదరులైన లవ్ సిన్హా, కుశ్ సిన్హాలు మాత్రం తమ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేకపోయారు. అంటే.. ఇండస్ట్రీలో ఇంతవరకు ఎంట్రీ ఇచ్చుకోలేకపోయారు. వారికి టాలెంట్ లేదనో.. మరే ఇతర కారణమో తెలీదు కానీ.. వారిద్దరి సోనాక్షీ కంటే పెద్దవారైనప్పటికీ ఆమెలాగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అందువల్లే వారిద్దరూ కలిసి ‘‘క్రాటోస్ ఎంటర్ టైన్ మెంట్’’ పేరిట చిత్రా నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట! ఇందులో సోనాక్షి భాగస్వామ్యం కూడా వుంటుందని కుశ్ సిన్హా తన ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇలా ఈ విధంగా ఈ అమ్మడు బిజినెస్ రంగంలో అడుగువేయబోతోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  luv sinha  kush sinha  kratos entertainment production  telugu news  

Other Articles