Vijay kumar konda says story about oka laila kosam

oka laila kosam latest updates, oka laila kosam movie rating, vijay kumar konda on oka laila kosam, swpnika acid attack in oka laila kosam, oka laila kosam story inspiration, naga chaitanya next movie, tollywood latest news, latest telugu news

vijay kumar konda says story about oka laila kosam : director of oka laila kosam movie says that he taken this story from a real incident which happend in warangal acid case of swapnika with that incident he inspired and fixed to show how a real lover will be

లైలా విజయం వెనక వరంగల్ విషాదం

Posted: 10/22/2014 01:45 PM IST
Vijay kumar konda says story about oka laila kosam

నాగ చైతన్య హీరోగా వచ్చిన తాజా సినిమా ‘ఒక లైలా కోసం’ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమాపై డైరెక్టర్ విజయ్ కొండేటి స్పందించాడు. ఈ సినిమా కధ ఏదో ఒకటి ఊహించుకుని రాసింది కాదు అన్నారు. రాష్ర్టంలో సంచలనం రేపిన ఓ విషాధంపై తనకు కలిగిన ఆవేదన నుంచి కధ పుట్టింది అని చెప్పారు. వరంగల్ లో యాసిడ్ దాడి ఘటన అప్పట్లో సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. తనను ప్రేమించాలంటూ ఓ ఉన్మాది స్వప్నిక అనే విద్యార్థినిపై యాసిడ్ దాడి చేశాడు.

ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని విజయ్ కొండేటి చెప్పాడు. లవర్ అంటే ఇలా ప్రేయసి ప్రాణం తీసే వాడు కాదు.., నిజమైన ప్రేమికుడు అంటే ఎలా ఉంటాడో చెప్పాలనే ఉద్దేశ్యంతో కసిగా ఈ కథను రాశానన్నారు. అలా యదార్ఘ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరెకక్కించాను అని వివరించారు. వాస్తవికత, విషాదం దాగిఉన్నాయి కాబట్టే కసిగా పనిచేస్తే.., కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు వస్తుందన్నారు. ఈ కథను చెప్పగానే చైతు, నాగార్జున బాగుందని తనను మెచ్చుకున్నారు అని అన్నారు.

నాగచైతన్య, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సినిమాకు ప్రేక్షకుల్లో మంచి టాక్ వచ్చింది. చైతు రొమాంటిక్ యాక్టింగ్, లవర్ బాయ్ రోల్స్ చాలా బాగున్నాయి అని ప్రశంసలు వచ్చాయి. ఇక పూజ కూడా తొలి మూవీయే అయినా కూడా చాలా చక్కగా చేసింది అని పేరు తెచ్చుకుంది. మొత్తానికి ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో ఆడుతోంది. ప్రతి విజయం వెనక ఓ విషాధం ఉంటుంది అన్నట్లు ఈ సినిమా విజయం వెనక నాటి వరంగల్ విషాదం ఉంది అని చెప్పటం బాధాకరం. అయితే ప్రేమికుడు ఎలా ఉండాలో కసిగా చూపించిన విజయ్ ప్రయత్నంను మెచ్చుకోవాలి.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oka laila kosam  vijay kumar konda  swapnika  movie news  

Other Articles