Dasari narayana rao says roudyism ruling tollywood

dasari narayana rao comments on tollywood, dasari narayana rao on chiranjeevi, dasari narayana rao on chiranjeevi family, mohan babu on chiranjeevi family, mohanbabu vs chiranjeevi, govindudu andrarivadele, tollywood latest updates

dasari narayana rao says roudyism ruling tollywood : director dasari narayana rao again given sensational comments on tollywood industry and chiranjeevi family

టాలీవుడ్ లో రౌడియిజం ఉంది..

Posted: 10/21/2014 10:18 AM IST
Dasari narayana rao says roudyism ruling tollywood

ప్రముఖ నటుడు, దర్శకుడు దాసరి నారాయణ రావు మరోసారి టాలీవుడ్ పై సంచలన కామెంట్లు చేశారు. ఇండస్ర్టీలో ప్రస్తుతం ఉన్న విధానాలు, పలువురి ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తుందన్నారు. ‘ఇప్పుడు ఉన్నంత నీచమైన స్థితిని టాలీవుడ్ లో మునుపెన్నడూ నేను చూడలేదు’ అని అన్నారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా నటించిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమా ఆడియో ఆవిష్కరణ సభలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇండస్ర్టీలో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేశారు.

పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా.., ఈ మద్య సెప్టెంబర్ 26న ‘లౌక్యం’ సినిమా విడుదల అయింది. అది బాగా వసూళ్ళు చేస్తుండగానే ఐదు రోజుల తర్వాత ఓ పెద్ద సినిమా వచ్చింది. దీనికోసం 37సెంటర్లలో ‘లౌక్యం’ను తీసేసి పెద్ద సినిమాను వేశారు. కానీ ఏం జరిగింది.., నీటిబుడగలా ఆ సినిమా క్రేజ్ పేలిపోయింది. ముచ్చటగా మూడు రోజులు కూడా పూర్తిగా ఆడలేదు. దీంతో మళ్ళీ ‘లౌక్యం’ను తెచ్చి నడిపిస్తున్నారు.  అంటే పెద్ద హీరో సినిమాలు వస్తే చిన్న సినిమాలు తప్పుకోవాలి.., కానీ పెద్ద ప్రాజెక్టులు ఫెయిల్ అయితే మాత్రం మళ్లీ చిన్న సినిమాలే నడుపుతారు.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.

తాను వారసత్వ నటనకు వ్యతిరేకం కాదన్నారు. అందరూ కళాకారులే అనే విషయం గుర్తుంచుకుని మెలగాలన్నారు. ఆడని కధలతో సినిమా మీద సినిమా తీసి జనాల మీద రుద్దటం తప్పు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయటం తేలిక అని.., ఆడించేందుకు థియేటర్లను దక్కించుకోవటం గొప్ప విషయం అన్నారు. థియేటర్లను ముందుగానే బ్లాక్ చేసి.., చిన్న సినిమాలు ఆడకుండా కొందరు రౌడియిజం చేస్తున్నారని విమర్శించారు. డిస్ర్టిబ్యూటర్లను ప్రలోభ పెట్టి థియేటర్లు చిన్న సినిమాల వైపు చూడకుండా వ్యవహరిస్తున్నారనీ., ఇది మంచి పద్దతి కాదన్నారు.

కళాకారులు అంతా కలిసి మెలిసి ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తేనే పరిశ్రమ పదికాలాల పాటు ఉంటుందని.., లేకపోతే గుత్తాధిపత్యంతో ఎవరిదారి వారిదే అన్నట్లుగా మారుతుందన్నారు. ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమాను నంద్యాల రవి డైరెక్ట్ చేయగా.., గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. ఈ మూవీకి కే.ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  latest updates  loukyam  govindudu andarivadele  

Other Articles