Junior ntr puri jagannath movie shooting stop in goa due to tollywood strike

junior ntr news, junior ntr movies, junior ntr movie shooting stop, junior ntr puri jagannath movie shooting stop, producer bandla ganesh, kajal agarwal latest news, junior ntr kajal agarwal news, puri jagannath kajal agarwal news, puri jagannath ntr movie news, tollywood strike

junior ntr puri jagannath movie shooting stop in goa due to tollywood strike

పూరీ-ఎన్టీఆర్ సినిమాకు అడ్డుపడుతున్న టాలీవుడ్!

Posted: 10/20/2014 04:50 PM IST
Junior ntr puri jagannath movie shooting stop in goa due to tollywood strike

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎంతగానో ఆరాటపడుతున్నాడు. ఆచితూచి కథలను ఎంచుకుంటున్నప్పటికీ.. ఫలితం మాత్రం దక్కడం లేదు. అందుకే.. ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నించాలని భావించిన ఎన్టీఆర్.. పూరీజగన్నాథ్ తో కలిశాడు. అలాగే పూరీ తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో తాను కూడా ఒక వైవిధ్యభరితమైన కథను ఎంచుకుని, పెద్ద హిట్ సాధించాలనే ఆశతో వున్నాడు. ఈ నేపథ్యంలో కలిసిన వీరిద్దరూ తమ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. షూటింగ్ కూడా మొదలుపెడుతామని అన్ని కార్యక్రమాలు ముగించేసుకున్నారు. కానీ ఇంతలోనే దురదృష్టం వీరికి టాలీవుడ్ రూపంలో ఎదురైంది. భారీ ఖర్చుతో తమ సినిమాను మొదలుపెడుతామని ఆశించిన వీరిద్దరికీ టాలీవుడ్ ఇచ్చిన షాక్ తో నీరుగారిపొయ్యాయి.

ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతుందనే సమాచారం అందరికీ తెలిసిందే! ఆ నేపథ్యంలోనే వీళ్లు తమ సినిమాకు కావలసిన పనులన్నీ ముగించేసుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ సోమవారం (20-10-2014) ప్రారంభం కావాల్సి వుంది. ఇందుకోసం హీరో సహా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఇప్పటికే గోవా చేరుకున్నారు కూడా! అయితే.. చిత్రపరిశ్రమలో వున్న కార్మికులందరూ తమ వేతనాలు పెంచాల్సిందేనంటూ కొన్నిరోజుల సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సమ్మెలో భాగంగానే టాలీవుడ్ లో ఏ చిత్రం కూడా షూటింగ్ జరుపుకోవడం లేదు. ఇప్పుడు ఆ సినిమాల జాబితాలో పూరీ-ఎన్టీఆర్ సినిమా కూడా చేరిపోయింది. ఆ సమ్మె ఎఫెక్ట్ వల్లే గోవాలో వీరిద్దరి షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ దెబ్బతో పూరీ - ఎన్టీఆర్ లతోపాటు నిర్మాత బండ్ల గణేష్ కూడా తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles