Samantha speaks about her marriage life and experience as heroine

samantha, samantha latest news, samantha marriage life, samantha marriage news, samantha boyfriend, samantha hot photo shoot, samantha latest photos, samantha images, samantha stills, samantha marriage updates, samantha movie updates, samantha producer, samantha programmes, konchem touch lo unte cheptha programme, telugu news, tollywood news

samantha speaks about her marriage life and experience as heroine

క్లైమాక్స్ కు చేరిన సమంత సినిమా జీవితం!

Posted: 10/20/2014 04:06 PM IST
Samantha speaks about her marriage life and experience as heroine

ప్రస్తుతం వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత సినిమా జీవితం క్లైమాక్స్ కు చేరిపోయినట్లు తెలుస్తోంది. చేతిలో ఇంకా ఐదారు సినిమాలు ఆఫర్లు వున్నాయి.. ఈమెకు అడ్డుగా మరే హీరోయిన్ లేదు.. ఈమెకున్న క్రేజ్ మరే తారకు లేదు.. అయినప్పటికీ ఈ జెస్సీ మేజిక్ ఇకపై పనిచేయదనే వార్తలు అన్ని చిత్రపరిశ్రమల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం.. ఈమె ప్రేమ వ్యవహారం! అవును.. ఈ అమ్మడు గత రెండేళ్ల నుంచి ఒక వ్యక్తితో గాఢంతో ప్రేమిస్తోందని.. త్వరలోనే అతనితో పెళ్లి కూడా చేసుకుంటానని ఒక కార్యక్రమం నిమిత్తం స్పష్టం చేసింది. సినిమా జీవితం నుంచి తాను రిటైర్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు కూడా ఆ అమ్మడు వెల్లడించి.. అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.

‘‘కొంచెం టచ్ లో వుంటే చెప్తా’’ అనే కార్యక్రమంలో వచ్చిన సమంత.. తన వ్యక్తిగత విషయాలను పూర్తిగా బహిర్గతం చేసింది. మరో మూడేళ్ల తర్వాత తాను నటనకు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకోవడం ఖాయమని వెల్లడించింది. ప్రస్తుతం తానొక వ్యక్తితో ప్రేమలో వున్నానని చెప్పి ఆశ్చర్యపరిచిన సమంత.. మరో మూడేళ్లలో అతనినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అలాగే జీవితం మీద తన అభిప్రాయాన్ని తెలుపుతూ... ‘‘లేటు వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా లేటుగా పుడతారు. వాళ్లు పెరిగి పెద్దయ్యేసరికి నేను ముసలిదాన్ని అయిపోతాను. అంటే.. నాకు 60 ఏళ్లు వచ్చేటప్పటికీ, నా పిల్లలు కేవలం 15 వయస్సులో వుంటే వాళ్లతో నేను ఆడుకోలేను.. వారి ఆలనాపాలనా చూసుకోలేనను. అందుకే.. 30 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను’’ అని తన మనసులో మాట తెలిపింది.

అంతేకాదు.. తనకు సినిమా నిర్మాణం అంటే కూడా చాలా ఇష్టమని పేర్కొంది. ఆ విషయాల మీద సమంత మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టం. హీరోయిన్ గా రిటైర్ అయిన తర్వాత సినిమా నిర్మించే అవకాశాలున్నాయి’’ అని వెల్లడించింది. దీంతో సమంత మాటలు విన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘‘సమంత చాలా తెలివైంది.. తన జీవితాన్ని బాగానే సరిదిద్దుకుంటోందని’’ అందరూ ఆమెను ప్రశంసించారు. అయితే ఆమె ప్రేమిస్తున్న వ్యక్తి వివరాలు బహిర్గతం చేయకపోవడంతో నిరాశకు గురయ్యారు. గత రెండేళ్ల నుంచి సమంత ప్రేమిస్తున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోనే ఎవరైనా వుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles