Actress dia mirza ready for marriage and nithin may get marriage soon

diya mirza marriage, dia marriage photos, dia miraza marriage highlights, dia mirza next movie, nithin marriage, nithin wife photo, nithin wouldbe name and photos, nithin next movie, chinnadana neekosam movie, bollywood latest updates, tollywood latest updates

actress dia mirza ready for marriage and nithin may get marriage soon : bollywood actress diya mirza become bride in mehandi utsav for sahil sangha and tollywood star hero nithin also may get marriage soon his family searching for a good traditional girl for him

దియా.. నితిన్ ఇంట పెళ్ళి హంగామా

Posted: 10/18/2014 03:51 PM IST
Actress dia mirza ready for marriage and nithin may get marriage soon

బాలీవుడ్ ప్రముఖ నటి దియా మీర్జా పెళ్లికి ముస్తాబయింది. మెహంది ఉత్సవ్ లో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా డ్రెస్సులతో పెళ్ళికూతురై కన్పించింది. నిర్మాత, వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాతో ఢిల్లీలో దియా పెళ్ళి జరగనుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పుట్టిన దియామిర్జా.., విద్యారణ్య పాఠశాల, నాజర్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి స్టాన్లీ కాలేజీలో ఇంటర్ చదివింది. అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ పై ఆసక్తితో అటు వెళ్ళిన దియా.. అందాల పోటిల్లో విజేతగా అలా సినిమాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత స్థానంలో ఉన్న ఆమె పలు సినిమాలను కూడా నిర్మించింది. సినిమాలతో పాటు బయట ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంది.

ఇక తెలుగు హీరో నితిన్ కు గడియలు వచ్చేశాయని తెలుస్తోంది. ప్రస్తుతం కెరీర్ మంచి ఫాంలో ఉన్న నితిన్ కు పెళ్లి చేయాలని ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కధనం ప్రచురించింది. మంచి సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి అయితే చాలు అని సుధాకర్ ఫ్యామిలీ భావిస్తోందట. బందువులు, తెలిసిన వ్యక్తుల్లో అమ్మాయి కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఎండాకాలంలో నితిన్ పెళ్ళి జరుగుతుందని తెలుస్తోంది.

జయం సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన నితిన్ ‘దిల్’, ‘సంబరం’, ‘ఆటాడిస్తా’ ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయిందే’ ‘హార్ట్ఎటాక్’ తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న‘చిన్నదాన నీకోసం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి దసరా కానుకగా ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది. మరి నితిన్ గుండె జారేలా హార్ట్ ఎటాక్ ఇచ్చే చిన్నది ఎక్కడుందో.. ఎప్పుడు హీరో దిల్ లోకి ప్రవేశించి ఇంట్లో సంబరాలు తెస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  dia mirza  marriage  latest updates  

Other Articles