Navika kotia become heroine with a tamil movie

navika kotia movies, navika kotia tamil movie, tamilmovies 2014, telugu movies in 2014, sharwanan next movie, sharwanan navika kotia movies, latest updates, tollywood latest updates, pawan kalyan movies, samantha sister

navika kotia become heroine with a tamil movie : child artiste navika kotia who famous by pawan kalyan attarintiki daredi movie now become heroine she acting in a tamil movie with sharwanan

సమంత చెల్లి తమిళంలో హీరోయిన్ అయింది

Posted: 10/18/2014 01:15 PM IST
Navika kotia become heroine with a tamil movie

చెన్నై భామ సమంత చెల్లి కోలీవుడ్ లో సినిమా తెరంగేట్రం చేసేందుకు సిద్ధం అవుతోంది. సమంతకు చెల్లి.., అదీ ఇండస్ర్టీలో ఎవరా అనుకుంటారా.?. సొంత చెల్లి కాదు లెండి.. టాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత సమంత చెల్లిగా నటించిన నవిక కొటియా. పవన్ మూడవ మరదలిగా ఈ సినిమాలో నవిక బాగానే నటించింది. ఈ సినిమా హిట్ ప్రభావంతో నవిక దశ తిరిగి హీరోయిన్ అయింది అని అంటున్నారు.

‘మురుగాట్రుపడై’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ర్టీకి పరిచయం అవుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ మూవీ ద్వారా శరవణన్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. శిఖరం విజువల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో కె.మురుగానందం అనే కొత్త డైరెక్టర్ కూడా ఇండస్ర్టీకి పరిచయం అవుతున్నాడు. గతంలో ఈయన పలు సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించాడు. ఈ మూవీ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అక్కలుగా నటించిన ప్రణిత, సమంత ప్రస్తుతం ఇండస్ర్టీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నారు. వీరిలాగానే నవిక కొటియా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : navika kotia  attarintiki daredi  sharwanan  latest updates  

Other Articles