Venkatesh next movie with dasarath

venkatesh next movie, venkatesh movie with dasarath, venkatesh upcoming movies, venkatesh family movies, venkatesh in gopala gopala movie, gopala gopala movie updates, tollywood latest updates

venkatesh next movie with director dasarath : victory venkatesh to act in family movies director dasarath movie soon this project will shooted after gopala gopala movie production work completes

రెండు ఫ్యామిలి పటాసులు పేలితే బ్లాక్ బస్టరే !

Posted: 10/16/2014 01:21 PM IST
Venkatesh next movie with dasarath

ఫ్యామిలి సినిమాలు చేసి సక్సెస్ పొందిన హీరో విక్టరీ వెంకటేష్ మరో కుటుంబ కధా చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అదికూడా ఆషామాషి డైరెక్టర్ తో కాదు. ఫ్యామిలి సినిమాలో తీయటంతో సిద్దహస్తుడుగా ముద్రపడిన దశరథ్ తో సినిమా చేస్తున్నాడట. ఈ మద్య వెంకీని కలిసిన దశరధ్ ఓ కధ చెప్పారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ కధ ఓకే అయితే వచ్చే ఏడాది సినిమా సెట్లపైకి వెళ్లవచ్చు అని తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకటేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తయితే దశరధ్ కధ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారంతా. అయితే ఈ లోపు రవితేజతో మల్టీస్టారర్ సినిమా ‘కూడా చేయవచ్చు అని అంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీ స్టారర్ హిట్ కావటంతో అదే ఊపుతో వెంకటేష్ మరిన్ని మల్టీస్టార్ మూవీలు చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ ప్రేమకధ, యాక్షన్ ఇలా భిన్న పాత్రల్లో నటించినప్పటికి ఫ్యామిలి కధలు ఎక్కువ పాపులర్ అయ్యాయి. విక్టరీ హీరో చేసిన సినిమాలు కూడా ఎక్కువగా ఇవే ఉన్నాయి.

ఇక కుటుంబ కధా సినిమాలు చేయటంలో గుర్తింపు తెచ్చుకున్నాడు దశరథ్. గతంలో ఆయన తీసిన ‘సంతోషం’, ‘మిస్టర్ పర్ ఫెక్ట్’, ‘గ్రీకువీరుడు’ వంటి సినిమాలు ప్రజాదరణ పొందాయి. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్, యూత్ క్రేజ్ ఉన్న హీరోను పెట్టి హిట్ కొట్టిన రికార్డు దశరధ్ కు ఉంది. ఇలాంటి ఇద్దరు ఫ్యామిలి దిగ్గజాల కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో సూపర్ హిట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొంత సమయం పడుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  dasarath  telugu movies  latest updates  

Other Articles