Jyothi laxmi movie not biography of jyothi laxmi says puri jagannath

charmi kaur, charmi kaur wiki, charmi kaur hot, charmi kaur latest hot photos, charmi kaur movies, charmi kaur latest movies, charmi kaur gossips, charmi kaur devi sri prasad, charmi kaur in jyothy laxmi movie, jyothy laxmi, jyoty laxmi hot, jyothy laxmi dance, latest news, movie news, puri jagannath, puri jagannath movies, puri jagannath jyothi laxmi, puri jagannath upcoming movies, puri jagannath charmi movie, tollywood, latest updates, telugu latest upates

director puri jagannath clarified that he is not making movie on dancer jyothi laxmi biography he is making that on a novel : my next movie story is based on Malladi Venkata Krishna Murthy novel but not of dancer jyothi laxmi

‘జ్యోతిలక్ష్మి’ సినిమా తీయటం లేదు - పూరి

Posted: 10/13/2014 05:01 PM IST
Jyothi laxmi movie not biography of jyothi laxmi says puri jagannath

అలనాటి డాన్సర్ జ్యోతిలక్ష్మి జీవితాన్ని సినిమాగా తీస్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. ‘జ్యోతిలక్ష్మి’ జీవితంపై తాను సినిమా తీయటం లేదు అని డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రకటించారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా జరుగుతున్ ప్రచారంకు పూరి ముగింపు పలికారు. తాను తీయబోయే ‘జ్యోతిలక్ష్మి’ వేరు ప్రచారంలో ఉన్న ‘జ్యోతిలక్ష్మి’ వేరు అని వివరణ ఇచ్చారు. డాన్సర్ జ్యోతి లక్ష్మికి తన సినిమాలోని జ్యోతి లక్ష్మికి సంబంధం ఉండదన్నారు. ఇక తన సినిమాపై మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారాయన. అదేమంటే ఈసినిమా కధను ఓ నవల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడిన పూరీ జగన్నాధ్.., తన తొలి సినిమాగానే దీన్ని చేయాలనుకున్నా కుదరలేదు అని.., అయితే ఇప్పుడు ‘జ్యోతిలక్ష్మి’ని తెరకెక్కించేందుకు సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘రోమియో’ సినిమాకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ‘జ్యోతిలక్ష్మి’కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. జగన్నాధ్ డైరెక్షన్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అనే చార్మి కల ఈ మూవీతో నెరవేరనుంది.

త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయగల డైరెక్టర్ గా పేరున్న పూరి ఈ సినిమాను కూడా త్వరలోనే పూర్తి చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తియితే ఆ తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ని పట్టుకుంటారని తెలుస్తోంది. సాధారణమైన కధలు, లేదంటే సొంతంగా క్రియేట్ చేసిన కధలను సినిమాలుగా తీసే జగన్నాధ్ తొలిసారి నవలను ఆధారంగా చేసుకుని మూవీ తీస్తుండటంతో ఎలా ఉంటుందో చూడాలి అని సిని ప్రముఖులు అంటున్నారు. అయితే నవలలో ఉన్న గొప్పదనం, కధ విశిష్టతను కాపాడేలా సినిమా ఉండాల్సిన అవసరం ఉందని సాహితి వేత్తలు సలహా ఇస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothi laxmi  charmi  puri jagannath  latest updates  

Other Articles