Child artist shriya sharma tollywood entry with gayakudu movie

child artist shriya sharma, shriya sharma latest news, shriya sharma gayakudu movie, shriya sharma hot photos, shriya sharma biography, gayakudu movie stills, hero roshan, music director koti news, tollywood child artists

child artist shriya sharma tollywood entry with gayakudu movie

టాలీవుడ్ కి బుక్కైన మరో చైల్డ్ ఆర్టిస్ట్!

Posted: 10/11/2014 01:13 PM IST
Child artist shriya sharma tollywood entry with gayakudu movie

ఈమధ్య తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్లకంటే కొత్త తారల హవానే ఎక్కువగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. స్టార్ హీరోయిన్లు ఎక్కువ రెమ్యునరేషన్లను డిమాండ్ చేయడంతోపాటు ఎక్స్ పోజింగ్ విషయంలో కండిషన్లు పెడుతుంటారు. కానీ కొత్త తారలు మాత్రం అలా కాదు... చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడంతోపాటు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయరు. అందుకే దర్శకనిర్మాతలు ఒకే తారతో ఎక్కువ సినిమాలు తీయకుండా.. కొత్త అందాలను టాలీవుడ్ కి పరిచయం చేయిస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టుల లిస్ట్ చాలావరకు పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకే హిందీ సీరియళ్లలో నటిస్తున్న అవికా గోర్, ఇంకా ఇతర చైల్డ్ ఆర్టిస్టులు టాలీవుడ్ లో హీరోయిన్లుగా కొనసాగుతుండగా... తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ తన కెరీర్ ను పరీక్షించుకోవడానికి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

‘‘జై చిరంజీవా’’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుకున్న శ్రియ శర్మ... పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో బాలనటిగా బాగానే రాణించింది. అలాగే ‘‘రస్నా’’ వాణిజ్య ప్రకటనతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పదిహేడేళ్ల వయస్సులోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో నాయికగా ఎంట్రీ ఇస్తోంది. సంగీత దర్శకుడు కోటీ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘‘గాయకుడు’’ చిత్రం ద్వారా ఈ అమ్మడు కథానాయికగా పరిచయం అవుతోంది. ఇందులో రోషన్ సంగీత దర్శకుడిగా నటిస్తుండగా... శ్రియ బాగానే అందాలు ఆరబోసేసిందని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా బాగానే గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. సినిమాలో బాగా నటించిందని ఆ చిత్ర యూనిట్ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. ఇటీవలే ఆడియో వేడుకను జరుపుకున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదల కాబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles