Nithin chinnadana neekosam first look

chinnadana neekosam, chinnadana neekosam movie, chinnadana neekosam movie first look, chinnadana neekosam movie release date, chinnadana neekosam nithin photos, chinnadana neekosam latest updates, chinnadana neekosam cast and crew, chinnadana neekosam songs, chinnadana neekosam shooting, chinnadana neekosam mishti, nithin, nithin wiki, nithin latest movies, nithin upcoming movies, nithin latest news

hero nithinreddy latest movie chinnadana neekosam first look released before dasara festival as a festival gift to his fans : chinnadana neekosam first look released on 2nd october on the occassion of dasara

చిన్నదానితో నితిన్ దసరా వేడుకలు

Posted: 10/02/2014 05:00 PM IST
Nithin chinnadana neekosam first look

హీరో నితిన్ దసరా సంబరాలు మొదలయ్యాయి. చిన్నదానితో కలిసి తెగ చిందులేస్తున్నాడు. దసరా పండగ నీకోసమే అంటూ కొత్త పాటలు పాడుతున్నాడు.., సరికొత్తగా ఆడుతున్నాడు. అటు ప్రేక్షకులు కూడా పండగ చేసుకోండి అంటూ అందరికి కలిపి కామన్ గా గిఫ్ట్ ప్రకటించాడు. చూస్తేనే చాలు అన్పించేలా ఉందా బహుమతి. అదే ‘చిన్నదాన నీకోసం’ మూవీ ఫస్ట్ లుక్. లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నితిన్.., కొత్త సినిమా ‘చిన్నదాన నీకోసం’ ఫస్ట్ లుక్ అక్టోబర్ 2న విడుదల అయింది. దసరా శుభాకాంక్షలు చెప్తూ.., సినిమా యూనిట్ ఈ పోస్టర్ విడుదల చేసింది.

నితిన్ హీరోగా వస్తున్న ‘చిన్నదాన నీకోసం’ మూవీలో మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ‘కాంచి ద అన్ బ్రేకబుల్’ అంటూ ఇండస్ర్టీకి వచ్చిన ఈ బెంగాలీ భామ నితిన్ తో కలిసి తెలుగు ఇండస్ర్ర్టీలోకి కుడికాలు పెడుతోంది. లక్కు పరీక్షించుకునేందుకు విజయదశమి సీజన్ ను ఎంచుకుని పోస్టర్ ను బయటకు విడుదల చేశారు. ఇందులో నితిన్ పసుపు రంగు టీషర్లు... అక్కడక్కడా చినిగిన జీన్స్ వేసుకుని రొమాంటిక్ గా నవ్వుతూ కవ్విస్తున్నాడు. ఇక వెనకాల తన మనస్సులో ఉన్న కలల సుందరి ప్రతిరూపంను స్కెచ్ వేశారు. పోస్టర్ లో కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అని అప్పుడే ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి.

కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న ‘చిన్నదాన నీకోసం’ మూవీకి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖిత రెడ్డి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత వారే కాబట్టి బడ్జెట్ విషయంలో మొహమాటం ఉండదు అని అనుకుంటున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తున్న మూవీకి ఈ మద్య పాపులర్ అయిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఫైట్ మాస్టర్ విజయ్ నితిన్ బాడి లాంగ్వేజ్ కు సెట్ అయ్యేట్లుగా యాక్షన్ సీన్లు సృష్టిస్తున్నాడు. మొదట్లో వరుసగా సినిమాలు చేసిన నితిన్ కొద్దికాలం డౌన్ ఫాల్ చూశాడు. ఆ తర్వాత మళ్లి ‘ఇష్క్’ అంటూ మొదలు పెట్టి.., నిత్యతో కలిసి రెండవ సినిమాగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో బంపర్ హిట్ కొట్టి ఐయామ్ బ్యాక్ అన్పించుకున్నాడు. అదే ఊపుతో లవర్ బాయ్ క్రేజ్ తో ‘చిన్నదాన నీకోసం’ సినిమా చేస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinnadana neekosam  nithin  latest news  tollywood  

Other Articles