Actress anjali on her marriage

anjali, heroine anjali, actress anjali, telugu actress anjali, telugu heroine anjali, anjali actress, anjali heroine, anjali wiki, anjali marriage, anjali family, anjali kidnap issue, anjali affairs, telugu actress, tamil actress, heorines, hot, anjali latest photos, anjali latest photoshoot, anjali hot photos, anjali hot images, latest news, tollywood

telugu actress anjali opened mouth about her marriage says still she is younger to marriage : prenesntly i am focusing on films only not thinking about marriage after my career set with a good oppertunities i will think about marriage life says heroine anjali

ఇప్పటికింకా నా వయసు నిండా...

Posted: 10/02/2014 10:06 AM IST
Actress anjali on her marriage

‘పోకిరి’ మూవీలో మమైత్ పాడిన పాటనే హీరోయిన్ అంజలి బయట పాడుతోంది. పెళ్లి విషయం ప్రస్తావించిన మీడియాతో ‘‘నాకిప్పుడే పెళ్ళేమిటి’’ అని షాకయినట్లుగా మాట్లాడింది. తనకు ఇంకా పెళ్లి వయస్సే రాలేదు అని చెప్తోంది. పెళ్లి విషయానికి వస్తే తాను ఇంకా చిన్న అమ్మాయినే అన్నట్లుగా చెప్పింది. ఇప్పుడు తన దృష్టంతా కెరీర్ ను మంచిగా మలుచుకోవటంపైనే ఉందని వెల్లడించింది. సినిమా ఆఫర్లలో మంచి కధలు ఎంపిక చేసుకుని.., మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకుల ఆదరణ పొందడమే ప్రస్తుతం తన టార్గెట్ అని చెప్తోంది.

కెరీర్ పట్టాలు ఎక్కితే.. తాను పెళ్ళి పీటలు ఎక్కుతానని అప్పటివరకు మరో లైఫ్ పై ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇంతకి పెళ్లి విషయం ఎందుకు వచ్చిందంటే.., ‘ ఈ మద్య మీడియాలో అంజలిపై చాలా వార్తలు వచ్చాయి.. అందులో ప్రధానంగా ఈ అమ్మడికి పెళ్ళి అయిపోయిందని కాని బయటకు చెప్పటం లేదని ప్రచారం జరిగింది.’ ఇదేదో కొంపముంచే ప్రచారమే అని భావించిన అంజు.., వెంటనే స్పందించింది. మీడియాలో తన పెళ్లిపై వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది. పెళ్లి కుదిరితే స్వయంగా మీడియాకు చెప్తానంది. తాను ఇంకా చిన్న పిల్లనే బాబు.. కొద్దిరోజులు వదిలేయండి అని చెప్పింది.

తెలుగమ్మాయి అయిన అంజలి.., తెలుగు, తమిళ సినీ ఇండస్ర్టీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే తమిళంలోనే పాపులర్ అయింది. ప్రస్తుతం అంజలి చేతిలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఉణ్నాయి. ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali  marriage  tollywood  latest news  

Other Articles