Anasuya wants to become singer

anasuya, anasuya wiki, anasuya hot, anchor anasuya, anasuya hot photos, anasuya latest hot photos, anchors hot, telugu hot photos, anchors latest news, indian hot photos, anasuya family, anasuya shows, latest news, tollywood, bollywood, actress, heorine, gossips, devi sri prasad, devi sri prasad songs

telugu hot anchor anasuya wants to become singer than actress in tollywood : anchor anasuya told about her dream in film industry that she want to become singer and tries to use every opertunity for that

దేవిశ్రీ నన్నసలు పట్టించుకోడే..!

Posted: 10/02/2014 09:55 AM IST
Anasuya wants to become singer

అభిమానులకు అనసూయ షాకింగ్ లాంటి వార్త చెప్పింది. తనకు సినిమాల్లో నటించటం ఇష్టంలేదని స్పష్టం చేసింది. నటించటం కంటే పాటలు పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని చెప్పింది. అసలు విషయానికి వస్తే.., తెలుగులో జబర్దస్త్ హాట్ యాంకర్ గా అనసూయ పేరు తెచ్చుకుంది. కొద్దికాలం గ్యాప్ తీసుకుని మళ్లీ కెరీర్ మొదలు పెట్టింది. పలు చానెళ్ళలో షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే బిజీగా ఉంది. ఈ తెలుగు ఆంటీ క్రేజ్ తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు కొందరు తమ సినిమాల్లో ఆఫర్లు ఇస్తాము.., హీరోయిన్ ను చేస్తాము అని తెగ ఫోన్లు చేస్తున్నారట.

పిలిచి పిల్లనిస్తానంటే.. ఏదో లోపం వెతికినట్లుగా.., సినిమా ఆఫర్ ఇస్తామని అంతగా చెప్తుంటే వెళ్ళను అని అంటోంది. ఓకే ఇది తన వ్యక్తిగత స్వేచ్చ దానికి ఎవరూ అడ్డు చెప్పలేరు. నటిగా కంటే సింగర్ గా పేరు పొందాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే అనూప్, రఘు కుంచె వంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఆడిషన్లకు పిలుస్తున్నారని చెప్పింది. అయితే డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనను అంత సీరియస్ గా తీసుకోవటం లేదని తెగ ఫీలవుతోంది. ఈ మద్య అమెరికాలో జరిగిన దేవిశ్రీ మ్యూజిక్ లైవ్ షోకు తాను యాంకర్ గా వ్యవహరించానని.., అయితే స్టేజిపై పాట పాడేందుకు అవకాశం ఇస్తాడని చాలా ఎదురుచూసినా.., ఆయన అంతగా తనను పట్టించుకోలేదు అని నవ్వుతూ చెప్పింది.

తనకున్న పట్టుదలతో ఎప్పటికైనా సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటాను అని ధీమాగా చెప్తోందీ హాట్ యాంకర్. అయితే నటించటం ఇష్టంలేదు కాని... టీవీషోలకు మాత్రం ఇప్పుడే దూరం కాను అని చెప్తోంది. ఎందుకంటే వాటి వల్లే తనకు గుర్తింపు వచ్చింది.., మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. అందుకే షోలను వదులుకోవటంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సో అనసూయను పెద్ద తెరపై చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది కానీ.. చిన్నతెర ఉండనే ఉందిగా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anasuya  anchor  singer  latest news  

Other Articles