Reason for mohanbabu yamaleela 2 late

mohan babu, mohan babu wiki, mohan babu latest, mohan babu movies, mohan babu family, mohan babu on telangana, mohan babu sons, manchu family, manchu laxmi, manchu vishnu, manchu manoj, yamaleela, yamaleela 2 movie, evergreen movies, telugu ever green movies, yamaleela movie, yamaleela 2 movie release date, sv krishna reddy, sv krishna reddy wiki, sv krishna reddy movies, latest news, movies, tollywood

film nagar talking about late in yamaleela movie release says graphics work is the reason for the movie late : mohan babu latest movie yamaleela 2 release late by graphics not with financial problems says movie team

బాబు యముడు ఎందుకు రావటం లేదంటే...

Posted: 09/30/2014 04:37 PM IST
Reason for mohanbabu yamaleela 2 late

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన తాజా సినిమా ‘యమలీల2’ విడుదల వాయిదా పడటానికి చాలా కారణాలు విన్పిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా నిర్మాతకు ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల సినిమా విడుదల ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అటు ఫిలింనగర్ వర్గాలు కూడా ఇదే విషయం వెల్లడించాయి. కాని తాజాగా అదంతా అబద్దమని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ కు ఎలాంటి ఫైనాన్స్ ఇబ్బందులు లేవట. మరి ఎందుకు ఆగిపోయింది అంటే స్పెషల్ ఎఫెక్ట్ కోసమని చెప్తున్నారు.

సోషియో ఫాంటసీ సినిమాగా వస్తున్న ‘యమలీల2’ సినిమా కధకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందట. ఈ వర్క్ విషయంలో సినిమా వర్గాలు ఎక్కడా తగ్గటం లేదని టాక్ వస్తోంది. అందువల్లే అన్ని ఎఫెక్టులు ప్రయోగించి పర్ ఫెక్ట్ గా బొమ్మ పడేందుకు కాస్త సమయం పడుతోంది అని చెప్తున్నారు. క్వాలిటి బాగుంటే కలెక్షన్లు కూడా బాగుంటాయని వీరంతా నమ్ముతున్నారు. ఎటుపోనూ ప్రేమకధా సినిమా, పోలిస్ స్టోరి కాదు కాబట్టి ఎప్పుడు విడుదల చేసినా ఆడుతుంది అనే నమ్మకంతో నిదానమే ప్రధానం అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఆలస్యం అమృతం విషం అనే విషయం మర్చిపోవద్దని టాలీవుద్ ప్రముఖులు సూచిస్తున్నారు.

చాలా గ్యాప్ తర్వాత కుటుంబ కధా చిత్రాల దర్శకుడు ఎస్.వీ. కృష్ణారెడ్డి ‘యమలీల 2’ను డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సిరీస్ లో సత్యనారాయణ యముడి పాత్రలో నటిస్తే.., ఇందులో మోహన్ బాబు యముడిగా మెప్పిస్తారని ఫిలింనగర్ లో గుసగుసలు వస్తున్నాయి. క్రిష్వీ ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో కె.వి. సతీష్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు ఆయనే నిర్మాత కూడా. అందుకే యముడి వద్ద తనను తాను మంచిగా  చూపించుకోవటం కోసం డబ్బు, క్వాలిటీ విషయంలో తగ్గటంలేదని గుసగుసలు వస్తున్నాయి. అటు డైరెక్టర్ కూడా మంచి సినిమా చేశాము అన్పించుకోవటం కోసం కాస్త లేట్ అయినా లేటెస్టుగా వద్దాము అన్నట్లుగా గ్రాపిక్స్ కోసం ఆగుతున్నాడు. చూడాలి మరి ఎప్పుడు రెండవ యముడు బయటకు వస్తాడో..?


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yamaleela 2  mohan babu  sv krishna reddy  latest news  

Other Articles