Tamil fans plans to build a temple of nayanatara

nayanatara, nayanatara hot photos, nayanatara latest news, nayanatara news, nayanatara movies, nayanatara temple, nayanatara tamil news, nayanatara fans, nayanatara biography

tamil fans plans to build a temple of nayanatara

బజారుకు లాగొద్దని వేడుకుంటున్న 9తార!

Posted: 09/26/2014 04:28 PM IST
Tamil fans plans to build a temple of nayanatara

చిత్రపరిశ్రమలో వున్న తారలకు సంబంధించి ఏవైన వ్యక్తిగత విషయాలు బయటపడితే వాళ్లు దానిని అంత తేలికగా తీసుకోరు. అంతెందుకు.. వారి ప్రేమవ్యవహారాల గురించి కొన్ని రూమర్లు వస్తే చాలు.. ఆ వార్తలను ప్రచురించిన వారిపై సదరు తారలు పరోక్షంగా నిప్పులు చెరుగుతారు. అటువంటిది వారికి సంబంధించిన ఇతర సన్నిహిత విషయాలను బయటపెడితే ఇంకేమైనా వుందా..? అలా చేస్తే ఆ వ్యవహారాలు కోర్టు దాకా వెళతాయి. అబ్బో.. పెద్ద రచ్చరచ్చే జరుగుతుందిలేండి! ఇక్కడ నయనతార విషయానికి వస్తే.. అటువంటి వ్యవహారాలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. కోర్టు దాకా వెళ్లలేదు కానీ.. మీడియాపై నిప్పులు చెరిగిన సందర్భాలూ వున్నాయి. ఆ విషయాలు కాసేపు పక్కనపెడితే... తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త కోలీవుడ్ లో బాగానే షికార్లు చేస్తోంది! తనను బజారుకు లాగొద్దంటూ నయనతార వేడుకుంటోందని ఇన్ సైడ్ టాక్!

కోలీవుడ్ మీడియా నుంచి వెలువడుతున్న వార్తాకథనాల ప్రకారం... నయనతార అభిమానులు ఆమెకోసం ఒక గుడి కట్టాలనుకుని నిర్ణయం తీసుకున్నారట! దీంతో వాళ్లందరూ కలిసి నయతారతో గుడికట్టడం కోసం అనుమతి తీసుకోవడానికి కలిసినట్టు సమాచారం! గుడికట్టేందుకు తమకు ఎటువంటి ఆర్థిక సహాయం అవసరం లేదని.. కేవలం గుడి కట్టడానికి అనుమతిస్తే చాలాని అభిమానులు అడిగినట్టు టాక్! కానీ, ఇందుకు నయనతార సమ్మతించలేదని న్యూస్! ‘‘మీరంతా నన్ను ఇంతలా అభిమానుస్తుంటే చాలా ఆనందంగా వుంది కానీ.. గుడి మాత్రం కొట్టొద్దు ప్లీజ్’’ అంటూ వారిని వేడుకుందట! ఈమె చాలా సున్నితంగా అభిమానులు కోరిన ప్రతిపాదనను తిరస్కరించిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. తనను బజారుకు లాగొద్దంటూ నయనతార కోరుకుందని.. ఇంకా రకరకాల పుకార్లు బాగానే చక్కర్లు కొడుతున్నాయి!

ఇదివరకే తమిళతంబీలు ఇతర తారల గుళ్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే! అప్పట్లో నటి ఖుష్బూకి, నమితకు గుడి కట్టారనే వార్తలు బాగానే వచ్చాయి. సిమ్రాన్ కు గుడికట్టాలనుకున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా నయనతార గుడి కట్టాలని అభిమానులు సందడి చేస్తున్నారు. కానీ అందుకు నయనతార మాత్రం తిరస్కరించేసింది. మరి దీని మీద అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara  kollywood  actresses temples  tamil fans associations  

Other Articles