Ntr discuss with director krish

jr ntr, jr ntr wiki, jr ntr movies, jr ntr latest, jr ntr family, jr ntr songs, jr ntr photos, jr ntr son photos, jr ntr son name, rabhasa movie, rabhasa latest, ntr latest movies, tollywood, krish, puri jagannath, sukumar, latest news

junior ntr discuss with director krish about his new movies, who is a no movies director now and failure hero in recent days : junior ntr doing movies with krish sukumar and also with puri jagannath

లాటరీ కొట్టేసిన క్రిష్

Posted: 09/23/2014 05:10 PM IST
Ntr discuss with director krish

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేని డైరెక్టర్లలో క్రిష్ ఒకరు. ఈయన చేతుల్లో బాలివుడ్ సినిమా ‘గబ్బర్’ ఉంది. ఆ తర్వాత చేయటానికి చేతిలో రెడిగా సినిమాలేవి లేవు. ఇంతటి కష్టాల్లో ఉన్న క్రిష్ ను జూనియర్ ఎన్టీఆర్ పిలిచాడట. సినిమా చేద్దాం రా అని చెప్పాడని ఫిలింనగర్ వర్గాల టాక్. దీంతో వెంటనే తారకరాముని సంప్రదించిన డైరెక్టర్.., కొత్త ప్రాజెక్టుపై చర్చించారు. అయితే ఇప్పటివరకు ఓకే కాకపోయినా.., త్వరలోనే సినిమా సిద్దం చేసేందుకు క్రిష్ చాలా కష్టపడుతున్నాడట. ఎందుకంటే కష్టకాలంలో కత్తిలాంటి ఆఫర్ వచ్చినట్లే.

అన్నీ ఓకే అయితే క్రిష్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం అయ్యే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడన్నమాట. ఇక ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారని నందమూరి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఇప్పటివరకు మాత్రం బయటకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ తో వివాదం పరిష్కారం కావటంతో ఆ సినిమా కోసం గెటప్ మార్చే పనిలో ఉన్నాడట. ఈ సినిమాతో పాటు సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘రామయ్యా.. వస్తావయ్యా’, ‘రభస’ సినిమాల ఫెయిల్యూర్ తో అప్రమత్తమైన నందమూరి, సినిమాలను సీరియస్ గా తీసుకున్నాడు. రెమ్యూనరేషన్ తగ్గించాడు. బడ్జెట్ కూడా ఎక్కువ వద్దు అని నిర్మాతలకు చెప్పేశాడు. ఇష్టంవచ్చినట్లు ఖర్చు పెట్టి.., డబ్బులు రాకుండా బాధకపడకండి అని సూచించాడట. హీరో్యిన్లకు కూడా అంత పెట్టడం అవసరమా..;? ఆలోచించండి అన్నాడు. ఇలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు కధల విషయంలో కూడా క్లారిటీ తీసుకుని ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు. సో తెలుగు విశేష్ తరపున జూనియర్ కు ఆల్ ది బెస్ట్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  puri jagannath  lto  

Other Articles