Kona venkat to start his direction with raviteja

ravi teja, ravi teja wiki, ravi teja movies, raviteja power movie review, ravi teja family, ravi teja latest, ravi teja gossips, kona venkat, power movie, power movie songs free download, power movie rating, power movie download, latest news, tollywood, movie news

kona venkat is doing his first movie of with ravi teja only : kona venkat fixed three years back only that if he directs a movie that would be with raviteja only now his dream comes true

పాత కధతో ‘‘పవర్’’పై ప్రయోగం

Posted: 09/23/2014 01:52 PM IST
Kona venkat to start his direction with raviteja

ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఈ పని చేస్తే ఇలాగే చేయాలి.., వీరితోనే కలిసి ఉండాలి. అని కలలు కంటుంటారు. అలాగే మాటలురాసే మన కోన కూడా ఓ కల కన్నాడు. పెన్ను వదలటానికి టైం ఎక్కడ దొరికిందో తెలియదు కానీ.., ఆ కాస్త ఖాళీ సమయంలో తాను దర్శకత్వంచేయాలని అనుకోవటం.., అదికూడా పవర్ తోనే సినిమా మొదలు పెట్టాలి అనుకున్నాడట. మరి అందులో అంత పవర్ ఏముందో ఆయనకే తెలియాలి. ఇక పవర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదులెండి. ‘పవర్’ సినిమా స్టార్ మాస్ మహారాజ రవితేజ.

తాను దర్శకత్వం వహించే తొలి సినిమా రవితేజతోనే చేయాలని మూడు సంవత్సరాల క్రితమే డిసైడ్ అయినట్లు చెప్తున్నాడు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి రవితేజను సినిమా హీరోగా ఊహించుకుని అప్పుడే కథ కూడా రాసి పెట్టుకున్నాడట. ఆ పేజిలు ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడ్డాటు కాబట్టి ఎక్కడా బయటకు రాలేదు. తను రాసుకున్న కధకు రవితేజ మాత్రమే సెట్ అవుతాడని ఫిక్సయి మరీ స్టోరి రాసుకున్నాడట. ఇక టైటిల్ కూడా సిద్ధమయింది. తెలుగులో ఒకప్పుడు ఏవీఎస్ పాపులర్ చేసిన ‘రంగుపడుద్ది’ అనే పేరును రవి సినిమాకు పెట్టాడు. మనోడి కాన్ఫిడెన్స్ కు నిజంగా మొక్కాల్సిందే.

 పంచ్ డైలాగులతో ప్రస్తుత సినిమాలకు కొత్తదనం క్రియేట్ చేసిన కోన... మరింత పంచ్ డైలాగులతో ఈ కధను రాసి ఉంటాడు. ఈ సినిమాలో ఇంచు ఇంచుకో పంచు పడుతుందేమో అని ఫిలింనగర్ వర్గాలు సరదాగా అనుకుంటున్నాయి. పేరు పడటం లేదని కామెడి డైరెక్టర్ తో పడక పక్కకు తప్పుకున్న కోన.., తన పేరును ‘‘కధ, మాటలు, దర్శకత్వం’’ పక్కన చూసుకుని మురిసేరోజులు ముందున్నాయన్నమాట. మరి ఆల్ ది బెస్ట్ కోన పాత కధతో పవర్ తో ప్రయోగం చేస్తున్నావు. అంతా మంచే జరగాలని మనసారా ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  kona venkat  tollywood  latest news  

Other Articles