Bellamkonda srinivas next movie producing by bujji

bellamkonda suresh, bellamkonda suresh movies, bellamkonda suresh family, bellamkonda srinivas, bellamkonda srinivas movies, bellamkonda srinivas wiki, bellamkonda srinivas latest news, bellamkonda srinivas family, latest news, tollywood

bellamkonda suresh still in loss pool with rabhasa and alludu srinu movies failures so he can't produce his son's movie : bellamkonda suresh unable to do his son's next movie with his continues loss in recent movies

శ్రీనుతో సినిమా చేయలేనంటున్న బెల్లంకొండ

Posted: 09/22/2014 03:55 PM IST
Bellamkonda srinivas next movie producing by bujji

బెల్లకొండ సురేష్ కు విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఎందరో ప్రముఖుల సినిమాలను నిర్మించిన ఆయనకు కొడుకు సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉండే రెండవ అదృష్టం లేదు. శ్రీనివాస్ రెండవ సినిమాను నిర్మించాలని బుజ్జి అనే నిర్మాతకు చెప్పాడట. బుజ్జి ప్రస్తుతానికి ‘రేసుగుర్రం’ హిట్ తో మంచి ఊపుమీదున్నాడు. అలాంటి వ్యక్తికి కొడుకు సినిమా చేయమని చెప్పాడు. ఇందుకు కారణం అతనికి మిగిలిన నష్టాలే అని తెలుస్తోంది. శ్రీను భారీ బడ్జెట్ సినిమా ‘‘అల్లుడు శీను’’ ఘోరంగా బోల్తా పడింది. ఈ దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తుండగానే ‘రభస’ సినిమా ఫట్టుతో దెబ్బమీద దెబ్బ పడినట్లయింది.

ఇలా వరుసగా రెండు సినిమాలు ఆడకపోవటంతో.., చేతిలోడబ్బుల్లేకుండా అయిపోయాడు. అటు శ్రీను చూస్తేనేమో మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఈ సారి బోయపాటి శ్రీనుతో ఈ శ్రీను కలసి వస్తున్నాడు. అది ఏ మేరకు ఉంటుందో తర్వాత చూద్దాం కాని.., ఈ సినిమా చేసేందుకు డబ్బులు లేకపోవటంతో బుజ్జికి అప్పగించినట్లు టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్ వస్తోంది.

కన్న కొడుకు సినిమాను చేయలేక సురేష్ పడుతున్న బాధను భరించరానిది. కాని తప్పదు.. హిట్టు అనుకుని భారీ బడ్జెట్ సినిమాలు తీస్తే ఏం జరగుతుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఎనీవే రెండవ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుందాం. కొడుకు ఎదుగుతుంటే తండ్రికి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిదంటారు. ఆ సంతోషం దగ్గరినుంచి ఫీల్ కాకపోయినా.., కనీసం సినిమాకు దూరంగా ఉండి అయినా.., ఆనందపడాలని ఆశిద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda srinivas  latest news  bujji  tollywood  

Other Articles