Aagadu distributors loss with flop

aagadu, aagadu movie, aagadu review, aagadu latest, aagadu rating, aagadu songs free download, aagadu mahesh babu, aagadu financiars, aagadu distributors, mahesh babu, mahesh babu latest news, mahesh babu movies, mahesh babu house, mahesh babu family, mahesh babu aagadu stills, distributors, latest news, gossips, film news, tollywood

distributors of aagadu film gained losses by the film flop talk they are in a very tensifide mode : aagadu distributors are going towards dark roads as they loss by the film demanding film persons to save them

ఆగమైన ఆగడు డిస్ర్టిబ్యూటర్లు

Posted: 09/22/2014 02:42 PM IST
Aagadu distributors loss with flop

సినిమా అంటే రంగుల ప్రపంచం. ఇందులో ఎప్పుడు ఎవరికి ఏ రంగు పడుతుందో చెప్పలేము. ఒకరు వెలిగిపోవచ్చు.., మరొకరు తేలిపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని బ్రతుకులు సినిమావారివి. సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పడవలో ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు బోల్తా పడక తప్పదు. ఇప్పుడు ‘ఆగడు’ సినిమా డిస్ర్టిబ్యూటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. కోట్లు కుమ్మరించి సినిమాను కొన్న డిస్ర్టిబ్యూటర్లు ఇప్పుడు రోడ్లు పట్టి తిరుగుతున్నారు. ‘ఆగడు’కు సక్సెస్ టాక్ రాకపోవటంతో.., పంపిణీదారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదుకోండి మహాప్రభో అంటూ ఫిలింనగర్ రోడ్లపై తిరుగుతున్నారు.

ఈనెల 19న విడుదలైన మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాకు ఆశించిన మేర స్పందన రాలేదు. కొత్తదనం లేని కధను పట్టుకుని కోట్లు ఖర్చు పెట్టడంతో అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. పొయిన సంవత్సరం హిట్ అయిన రెండు సినిమాలను కలిపి ఈ సినిమా తీసినట్లు టాక్ విన్పిస్తోంది. మహేష్ కు ఇప్పుడు హిట్ లేకపోయినా.. ఆయనకు చేతిలో ఉన్న ఆఫర్లు ఎటూ పోవు. అటు దర్శకుడు కూడా ఎంచక్కా మరో హీరోతో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు టీంను రెడి చేసుకుంటున్నాడు. సినిమా బ్యానర్ కూడా ఇంకో హిట్ పడకపోతుందా అన్న ఆశతో ఉంది. ఇక్కడ నష్టపోయింది డిస్ర్టిబ్యూటర్లు. అవసరం లేని అంచనాలున కల్పించి.., ఏదో ఉందని చూపించటంతో ఆశపడ్డ డిస్ర్టిబ్యూటర్లు అప్పులు తెచ్చిమరీ సినిమా హక్కులు కొనుక్కున్నారు. విడుదలయ్యాక వచ్చిన టాక్ తో.., కుదేలయ్యారు. నిండా మునిగాము ఇప్పుడెవరు ఆదుకుంటారు అని లబోదిబోమంటున్నారు. పోని సినిమా ప్రముఖులైనా పట్టించుకుంటారా అంటే వారు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని వాపోతున్నారు.

ఎందుకిలా జరుగుతోంది..?

ఒకప్పుడు వచ్చిన సినిమాలు అన్ని విభాగాలను సమాజంలోని అన్ని కోణాలను చూపేవి. విభిన్నమైన కధనాలతో సినిమాలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఒకటే ప్రేమించటం, లేదా కొట్టుకోవటం. కుదిరితే రెండు కలిపి ఒకే దాంట్లో చూపించేయటం. కాని ఇక్కడే డైరెక్టర్లు ఓ తప్పు చేస్తున్నారు. మంచి హీరోను పెట్టి ఏ కధను నడిపినా ప్రేక్షకులు చూసేస్తారులే అనుకుని ఘోరంగా విఫలం అవుతున్నారు. ఫలితంగా సినిమాలు ఆడలేక, ఓడలేక నలిగిపోతున్నాయి. ఇక ఒకప్పుడు సినిమా హిట్ కాలేదు అంటే నష్టపోయేది నిర్మాత మాత్రమే. సినిమా ఆడకపోతే డబ్బులు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సినిమాను డిస్ర్టిబ్యూటర్లకు అమ్మేసి ఖర్చు పెట్టిన డబ్బులు విడుదలకు ముందే వసూలు చేసుకుంటున్నారు. రిస్క్ ను తమ నుంచి డిస్ర్టిబ్యూటర్ల మీదకు తోస్తున్నారు. అలా సినిమాతో సంబంధం లేకపోయినా.., కేవలం డబ్బులు, వ్యాపార ఆసక్తితో వచ్చి పెట్టుబడి పెట్టి కోలుకోలేని విధంగా దెబ్బయిపోతున్నారు.

అంతేకాకుండా ఇఫ్పుడున్న సినిమాలు భారీ బడ్జెట్ తో వస్తున్నాయి. ఓ హీరోతో యాబై కోట్ల సినిమా వస్తే.. పక్క హీరో సినిమా డెబ్బయి కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే అన్నట్లుగా వ్యవరిస్తున్నారు. ఏమి లేకపోయినా.. ఇలా భారీ బడ్జెట్ సినిమాలు తీయటం వల్ల వాటిని కొన్న డిస్ర్టిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ లక్షల నుంచి కోట్లను దాటడం వల్ల ఖర్చులు పెరిగి తడిసి మోపెడు అవుతున్నాయి. ఫ్లాప్ వల్ల అంత డబ్బులు రాకపోవటంతో

ఆదుకునేది ఎవరు..?

సినిమా జీవితాలను దృష్టిలో ఉంచుకునే గతంలో కళాకారుల సంక్షేమ నిధి ఉండేది. నష్టపోయిన, కష్టం వచ్చిన వారిని ఆదుకునేందుకు పెద్దమనసున్నవారు ముందుకు వచ్చేవారు. కాని ఇప్పుడు అలాంటి దాఖలాలు చూద్దామన్నా లేవు. పూర్తిగా లాభాపేక్షతో ఎవరికి వారు స్వార్ధంగా ఆలోచిస్తున్నారు. ఫలితంగా తమకు నష్టాలు వస్తున్నాయని డిస్ర్టిబ్యూటర్లు అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ లాంటి కొందరు నటులు.., సినిమా ఆడకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా అందరూ బాగుండాలని ఆలోచిస్తే ఇప్పుడీ దుస్థితి ఉండేది కాదు. అటు వీరిని ఆదుకునేందుకు నిర్మాతలు, సినిమా పెద్దలు అంతా కలిసి వీరిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. సినీ కార్మికుల సంక్షేమ నిధి తరహాలో డిస్ర్టిబ్యూటర్లు, నిర్మాతలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

సినిమాలో మ్యాటర్ ఎంతున్నది అనేది పక్కనబెట్టి.., ఏదో ఉన్నట్లుగా చూపించటమే నష్టాలకు ప్రధాన కారణమని అంటున్నారు. అలా కాకుండా కొత్త కధలతో, డబ్బును చూసి ఖర్చుపెట్టి.., సినిమా వల్ల ప్రతి ఒక్కరూ బాగుండాలని మంచి ఉద్దేశ్యంతో తీస్తే ఖచ్చితంగా ఆడుతాయని.., ఆడిన సందర్బాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి రోజులు మళ్లీ రావాలని.., కళామతల్లి బిడ్డలందరూ బాగుండాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aagadu  distributors  tollywood  latest news  

Other Articles