Akshara hassan love with vivan breakup

akshara hassan, akshara hassan affair, akshara hassan love, akshara hassan wiki, akshara hassan movies, akshara hassan family, kamal hassan family, sruti hassan, sruti hassan latest, sruti hassan photos, akshara hassan love with vivan, akshara hassan dating, akshara hassan breakup, latest news, tollywood, bollywood, dating, actors affairs, heroines dating, viva, vivan dating with akshara hassan

kamal hassan second daughter akshara hassan's dating with vivan brokeup recently officially stated by vivan : akshara hassan and vivan's love broke up recently but vivan says that they broke a year back only

అక్షర ప్రేమదారం తెగిపోయింది

Posted: 09/21/2014 02:50 PM IST
Akshara hassan love with vivan breakup

కుదిరితే డేటింగులు.. లేదంటే బ్రేకింగులతో బాలీవుడ్ ఊగిపోతుంది. హీరోయిన్లు, హీరోలు డేటింగులు మొదలు పెట్టి.. డేట్ చూసుకుని విడిపోతున్నారు. ఈ విషయంలో కమల్ రెండవ కూతురు అక్షర హాసన్ అయితే కాస్త ముందుందనే చెప్పాలి. అక్క ఇండస్ర్టీలో డేట్స్ ఖాళీ లేకుండా బిజీగా ఉంటే.. చెల్లి మాత్రం డేటింగ్ లో బిజీగా అయిపోయిందని బాలీవుడ్ అంతా లౌడ్ స్పీకర్లై కూశారు. కమల్ రెండవ కూతురు అంటే ఠక్కున గుర్తుకువచ్చేది డేటింగ్, లవ్ విషయాలే. అంతలా ఫేమస్ అయిపోయిందీ అమ్మడు. అయితే ఇప్పుడీ అన్యోన్యమైన డేటింగ్ బంధం తెగిపోయింది. డేటింగ్ ముగిసింది బాబోయ్ అంటూ ప్రకటన కూడా వెలువడటం కొసమెరుపు

అక్షర ఆ మద్య బాలీవుడ్ నటుడు తనూజ్ తో రహస్య ప్రేమాయనం సాగించిందని తెగ పుకార్లు వచ్చాయి. వీరిద్దరి మద్య ఆ విషయం ఏముందో తెలియదు కానీ.., ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కొడుకు వివాన్ తో ప్రేమలో మునిగి తేలుతోందని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. వీటిని ఇద్దరూ ఖండించలేదు. ఇంకేముంది ఇది నిజమే అంటూ రెచ్చిపోయి మరి స్టోరీలు అల్లేసుకున్నారు సినిమా ప్రముఖులు. అయితే వీరిద్దరి లవ్ కూడా ఇప్పడు టైమ్ ఓవర్ అని తేలింది. స్వయంగా వివాన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. అక్షరతో డేటింగ్ చేసిన విషయం వాస్తవమే అని చెప్పిన వివాన్, ప్రస్తుతానికి మాత్రం ఇద్దరి మద్య ఏమి లేదన్నాడు.

అక్షర చాలా మంచిదని.., ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అని చాలా తక్కువే చెప్పాడనుకోండి. ఇక ఇద్దరి ప్రేమాయణం పాలు విరిగిపోవటానికి అక్షర అమ్మ కారణంగా గుసగుసలు వస్తున్నాయి. అక్కి చేస్తున్న సినిమాలు విడుదల కాకముందే ఇలాంటి వ్యవహారలతో పేరు తెచ్చుకోవటం అవమానకరమని.., అక్కను చూసి నేర్చుకోమని క్లాస్ తీసుకుందట. దీంతో కళ్లు తెరుచుకున్న అక్షర వివాన్ ను పక్కన బెట్టేసిందని టాక్. ఆ మద్య అసలు డేటింగ్ అంటేనే తెలియదు అని చెప్పగా.., ఇద్దరం డేట్ లో ఉన్నది నిజమే అని వివాన్ ప్రకటించటంపై ఏం చెప్తావమ్మా..? అంటూ బాలీవుడ్ ప్రశ్నిస్తోంది. ఇక అక్షర ప్రస్తుతం ‘ షమితాబ్’ సినిమాలో నటిస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara hassan  dating  vivan  latest news  

Other Articles