Ram gopal varma settairs on aagadu movie

ram gopal varma, ram gopal varma movie news, aagadu movie, aagadu movie news, aagadu ram gopal varma, ram gopal varma twitter, mahesh babu, director srinu vaitla, varma srinu vaitla mahesh babu, director ram gopal varma news

ram gopal varma settairs on aagadu movie by comparing with oscar awards

‘‘ఆస్కార్’’ రేసులో మహేష్ ‘‘ఆగడు’’!

Posted: 09/20/2014 01:50 PM IST
Ram gopal varma settairs on aagadu movie

(Image source from: ram gopal varma settairs on aagadu movie)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ‘‘ఆగడు’’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మీద దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రిన్స్ మూవీ కాబట్టి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక మూవీ రిలీజ్ అయింది.. గత సినిమాల్లో వున్న ఎలిమెంట్స్ ఇందులో చాలా వున్నాయని.. ఈసారి మహేష్ ఆగడు అంతగా ఆక్షించలేదని డివైట్ టాక్ తెచ్చుకుంది. అలాగే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో పరోక్షంగా సినిమాపై సెటైర్లు వేశారు.

ఇదివరకే ఈ సినిమాకు, మగధీర సినిమాల కలెక్షన్లలతో పోల్చిన వర్మ... ఈసారి డైలాగుల మీద పడ్డాడు. ‘‘ఆగడు’’ సినిమాలోని డైలాగ్స్ ని, డైలాగ్ మాడ్యులేషన్ ని స్పెషల్ నామినేషన్ క్రింద ఆస్కార్ ఎంట్రీకి పంపాలని, ప్రపంచ సినిమా చరిత్రలో 'ఆగడు డైలాగ్స్, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ నిలబడిపోతాయని ఆయన అపహాస్యం చేస్తూ ట్వీట్ చేశాడు. అలాగే కోన వెంకట్ ఇంత అద్భుతమైన డైలాగ్స్ రాయగలడని తాను అనుకోలేదని, తాను వెళ్లేసరికి సినిమా టైటిల్స్ అయిపోయాయని, అసలు ఇంతకీ డైలాగ్స్ రాసింది కోన వెంకటేనా? అని ప్రశ్నించాడు (ఈ సినిమాకి కోన వెంకట్ పనిచేయలేదు. మరి దీనిని కూడా సెటైర్ అనే అనుకోవాలేమో!).

తన కెరీర్ లో ఓ బెస్ట్ క్యారెక్టర్ ను ప్రకాష్ రాజ్ 'ఆగడు' చిత్రంలో 'మిస్' అయ్యాడని వర్మ మరో సెటైర్ వేశాడు. (ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత దర్శకుడు శ్రీను వైట్లకు, ప్రకాష్ రాజ్ కు వచ్చిన గొడవల కారణంగా...ఆ పాత్రకు ఆయన్ను తప్పించి సోనూ సూద్ ను తీసుకున్నారు). ఆఖరుగా, మహేశ్ బాబు అద్భుతమైన నటుడని... దయచేసి మహేశ్ బాబు మంచి పాత్రలు ఎంచుకునే విధంగా అభిమానులు ఆయనపై ఒత్తిడి తేవాలని వర్మ ట్వీట్ చేశాడు. మరి దీనిపై అభిమానుల స్పందన ఎలా వుంటుందో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  mahesh babu  srinu vaitla  aagadu movie  twitter  

Other Articles