Balakrishna turns to be padmasree

balakrishna, balakrishna movies, balakrishna legend movie, balakrishna wiki, balakrishna family, balakrishna photos, balakrishna still, cast and crew, balakrishna padamsree, padma awards, 2014 padma awards, balakrishna latest movies, balakrishna movies list, ap government, andhrapradesh, andhrapradesh government, andhrapradesh map, andhrapradesh map without telangana, andhrapradesh new map, andhrapradesh latest, latest news, padmasree for balakrishna, tollywood, nandamuri fans, kamma leaders, anantapuram, hindupuram, ap mla list, ap mp list, central government, modi

rumors that ap government may send proposal to give padmasree to balakrishna for his career in film industry : balakrishna who spent 40years successfully in film industry may get padmasree award if ap government send proposal

త్వరలో ‘‘పద్మశ్రీ’’ బాలకృష్ణ... ?

Posted: 09/19/2014 11:54 AM IST
Balakrishna turns to be padmasree

తెలుగు తెరకు నందమూరి కుటంబం చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివి. చెన్నైలో ఉన్న ఇండస్ర్టీని హైదరాబాద్ కు తీసుకువచ్చిఇక్కడ పరిశ్రమను పెట్టడంలో కీలక పాత్రపోషించారు. నట సార్వభౌముడుగా తారకరామారావు ఎదిగితే.., ఆయన వారసులు ప్రస్తుతం పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ. యువరత్న, నటరత్నగా పేరుపొందిన లెజెండ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తుల్లో ఒకరు. అలాంటి గొప్ప వ్యక్తి అయిన లెజెండ్ కు ఏపీ ప్రభుత్వం త్వరలోనే తగిన గుర్తింపు ఇస్తుందని తెలుస్తోంది. కేంద్రం ఏటా ఇచ్చే పద్మ అవార్డులకు ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ పేరును పంపుతుందని వార్తలు వస్తున్నాయి.

ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎనలేని ప్రతిభ ఉండేవారికి ఈ అవార్డు వస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ర్టంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖల పేర్లను పంపితే., కేంద్ర పద్మ అవార్డుల ఎంపిక కమిటీ.., వాటిని పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఈ పేర్లను మూడు నెలల ముందుగా కేంద్రానికి పంపిస్తే పరిశీలన చేసి జాబితాను రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం జాబితాను పంపుతోంది. ఈ లిస్ట్ లో సినిమా రంగం నుంచి బాలకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదన పంపుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు.

40ఏళ్ళ ప్రస్థానం

తెలుగు పరిశ్రమకు బాలయ్యకు విడదీయరాని బంధం ఉంది. నలబై ఏళ్ళుగా సినిమా రంగుల లోకంలో యువరత్న విహరిస్తున్నారు. ఎన్నో సినిమాలు చేసి సంచలనాల కలెక్షన్లు వసూలు చేశారు. ఇప్పటికి బాలకృష్ణతో సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు పోటి పడుతున్నారంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. బాలకృష్ణ మొదట్లో ఫ్యామిలి ఓరియంటెడ్, పోలిస్ బేసిడ్, సెంటిమెంట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి సినిమాల్లో నటించి వినూత్నంగొ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక 20వ శతాబ్దం తర్వాత బాలయ్య సీన్ మార్చాడు. పూర్తిగా యాక్షన్, పొలిటికల్ బేసిడ్ కధలతో పాటు ఫ్యాక్షన్ స్టోరీలు తీసుకుంటూ వచ్చాడు. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇలా ఫ్యాక్షన్ సినిమాలతో పాటు, పలనాటి బ్రహ్మనాయుడు వంటి హీరోయిజం చూపించే సినిమాలు తీశాడు.

యాక్షన్, డైలాగ్ డెలివరీ బాలకృష్ణకు బాగా కలిసి వచ్చే అంశాలు. బాలయ్య సినిమాలో డైలాగుల కోసం రైటర్లు ప్రత్యేకంగా ఆలోచించి మరీ రాస్తారు. ఇక పాటల పరంగా కూడా ఆయన ఇప్పుడున్న హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా డాన్స్ చేయగలడు. ప్రేమ అంశంగా సినిమాలు నడుస్తున్న ఈ తరంలో కూడా  ‘పాండురంగడు’ ‘శ్రీరామరాజ్యం’ సినిమాలు బాగా ఆడాయి అంటే అందులో బాలకృష్ణ కృషి ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. తనకు వచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేసి.., నిర్మాతలు నష్టపోకుండా సినిమాలు ఎంపిక చేసుకుంటాడనే మంచి పేరు ఉంది. అందువల్లే ఈ మద్య వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లెజెండ్ అయితే యాబై కోట్ల కలెక్షన్ సాధించి పెట్టింది.

ఇక సేవా పరంగా కూడా బాలకృష్ణకు మంచి పేరు ఉంది. తండ్రి పేరిట ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఉంటూ., నిత్యం వేలమందికి ఆస్పత్రి ద్వారా వైద్య సేవలను అందిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించే ఆస్పత్రిగా పేరు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఇలా సినిమా రంగంతో పాటు సేవా రంగంలో కూడా ఎనలేని ప్రతిభ చూపిస్తున్న బాలకృష్ణ ఈ మద్యే పూర్తస్థాయి ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసి.., హిందూపురం ఎమ్మెల్యేగా తొలిసారి పోటిలోనే గెలుపొందారు. ఇలా ప్రజల్లో విశేష ఆదరణ పొందిన బాలకృష్ణకు బావ చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే బాలయ్య కెరీర్ లో ఈ ఏడాది ఆయనకు లక్కీ ఇయర్ గా చెప్పవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  padmasree  latest news  ap government  

Other Articles