Upendra and sneha will appear in allu arjun s movie

upendra, kannada super star upendra, upendra movies, upendra latest, upendra romance, upendra wiki, sandalwood, tollywood, sneha, sneha marriage, sneha hot, sneha latest, allu arjun, allu arjun latest, allu arjun movies, allu arjun photos, allu arjun wiki, allu arjun mariiage, allu arjun son, trivikram srinivas, trivikram srinivas movies, trivikram srinivas wiki

kannada super star upendra and sneha is also in the part of allu arjun's new movie : upendra and sneha accepted to act in allu arjun's movie of trivikram directing

బన్నీ కోసం హైదరాబాద్ వస్తున్న స్నేహ

Posted: 09/18/2014 03:58 PM IST
Upendra and sneha will appear in allu arjun s movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ తీసే కొత్త సినిమాపై టాలీవుడ్ లో అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులాయి తర్వాత మనవాడు ఏం చేస్తున్నాడా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇకపోతే.., బన్నీతో తీస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు పెళ్లి చేసుకున్న స్నేహ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. వీరిద్దరూ సినిమాలో నటించాలని త్రివిక్రమ్ కోరడంతో అందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు.

తెలుగులో ఆ మద్య కొన్ని సినిమాలు చేసిన ఉపేంద్ర, కన్నడ ఇండస్ర్టీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు కాని.., శాండిల్ వుడ్ లో మాత్రం కేక పెట్టించాయి. అలాంటి నటుడు అర్జున్ సినిమాకు ఒప్పుకోవటంతో ఇది ఒకరకంగా ప్లస్ పాయింట్ అవుతుందని అంతా అంటున్నారు. అటు స్నేహ కూడా ఈ సినిమాకు మైలేజ్ ఇచ్చే క్యారెక్టరే చేస్తుందని భావిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ని వదిలిన తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న త్రివిక్రమార్కుడు ఈ సినిమాను ఎలా చూపిస్తాడా అని అనుకుంటున్నారు.

‘‘జులాయి’’ సినిమా తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ తో పాటు రాధాకృష్ణ నిర్మాతగా వస్తున్న సినిమా ఇదే. తొలిసారి బన్నీ పక్కన్న ముగ్గురు హీరోయిన్లను తీసుకువస్తున్నారు. వీరిలో సమంత, అదాశర్మ ఇప్పటికే ఖరారు కాగా.., మూడవ ముద్దుగుమ్మ కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఓ పేరును పరిశీలించినా., ఇంకా బెటర్ మెంట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమాలో మూడవ హీరోయిన్ తో పాటు పేరను కూడా ఖరారు చేసి రిజిస్టర్ చేయించుకుంటారట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : upendra  allu arjun  sneha  trivikram srinivas  

Other Articles