Sonal chouhan to act in nagarjuna s movie

sonal chouhan, sonal chouhan hot, sonal chouhan latest hot photos, sonal chouhan caste, sonal chouhan photos, sonal chouhan images, balakrishna, nagarjuna, nagarjuna latest, meelo evaru kotiswarudu show, latest news, telugu news, tollywood

sonal chouhan may finalise for nagarjuna's next movie as thamanna bhatia didn't adjut dates : nagarjuna next movie with two heroines one with ramyakrishna second one may be sonal chouhan

తమన్నా చాన్స్ కొట్టేసిన సోనాల్

Posted: 09/18/2014 03:29 PM IST
Sonal chouhan to act in nagarjuna s movie

కింగ్ నాగార్జున కొత్త సినిమా కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు కధ, స్క్రిప్ట్ పూర్తికాగా.., ప్రస్తుతం క్యారెక్టర్ల ఎంపిక జరుగుతన్నట్లు తెలుస్తోంది. అటు హీరోయిన్ల కోసం కూడా పలువురి పేర్లను పరిశీలిస్తోంది టీం. నాగార్జున రెండు పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రకోసం రమ్యకృష్ణను ఎంపిక చేశారు. ఇక రెండవ క్యారెక్టర్ కోసం తమన్నాను ఎంపిక చేశారు. అయితే ఆమె బిజీ షెడ్యూల్ వల్ల కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయింది. దీంతో మిల్కీబ్యూటిని పక్కనబెట్టారు.

అయితే ‘‘లెజెండ్’’ సినిమా ఫేం సోనాల్ చౌహన్ ను సినిమాలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం రోజు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన సోనాల్ ఫొటో షూట్ చేసిందట. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్న సినిమా యూనిట్ దాదాపుగా ఓకే చెప్తుందని అంటున్నారు. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న నాగార్జునకు ఈ హీరోయిన్ కూడా కొత్త అన్నమాట. అటు తమన్నా లేకపోవటంతో ఆ చాన్స్ ను ఈ అమ్మడు ఎగరేసుకుపోయింది.

సినిమాలో ఎంపిక చేసిన హీరోయిన్లను బట్టి.., నాగార్జున ఒకటి ఫ్లాష్ బ్యాక్ కధ లేదా.., తండ్రి పాత్రతో స్టోరి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ స్టోరికి రమ్యకృష్ణను తీసుకుని.., ప్రస్తుత కధకు సోనాల్ ను వాడుకునేలా కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ‘మనం’ సినిమా తర్వాత నాగార్జునకు ఇది కూడా ఆ మేరకు హిట్ ఇస్తుందని అభిమానులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonal chouhan  latest news  nagarjuna  tollywood  

Other Articles