No truth in anushka marriage rumors

anushka, anushka movies, anushka marriage, anuhka

manager of anushka says no truth in rumors of heroine's marriage rumors : anushka doing movies and she have some projects for future also so no marriage proposal now says her manager

బొమ్మాళి పెళ్లికి మేనేజర్ నో అన్నాడు

Posted: 09/18/2014 12:49 PM IST
No truth in anushka marriage rumors

యోగా బ్యూటి అనుష్క పెళ్లి అంటూ తెగ పుకార్లు వచ్చాయి. బాహుబలి చివరి సినిమా అనీ... తర్వాత సోలో లైఫ్ కు పుల్ స్టాప్ పెట్టేస్తుందని రూమర్లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా అబద్దమని తేలింది. అనుష్క పెళ్లి వార్తలపై ఆమె మేనేజర్ వివరణ ఇచ్చాడు. చెన్నైలో ఓ మీడియాతో మాట్లాడిన మేనేజర్ ఇప్పట్లో పెళ్ళి ప్రతిపాదనలు లేవన్నాడు. అంతేకాదు ‘‘బాహుబలి’’ సినిమా తర్వాత అనుష్క మరో సినిమా చేసేందుకు కూడా ఒప్పందం చేసుకుందున్నాడు. తెలుగులోనే తీసుకుంటే 'బాగమతి' లో ఆమె నటించనుంది.

అటు ప్రస్తుతం  తమిళంలో రజనీకాంత్ 'లింగా' షూటింగ్తో బిజీగా ఉన్న అనుష్క అది పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు తీసుకోవటం లేదన్నాడు. అటు అజిత్ సినిమాలో నటిస్తున్నదని, ఇవన్నీ పూర్తి అయ్యేవరకూ కొత్త ప్రాజెక్టులు ఒప్పకోవటం లేదన్నాడు. అంతమాత్రానికే పెళ్లి అంటూ  పుకార్లు పుట్టించటం సరికాదని మీడియా సంస్థతో తెలిపాడు. ఈ మద్య ఓ డైరెక్టర్ అనుష్కను కలిసి మంచి కధ చెప్పాడట. హీరోయిన్ నేపథ్యంగా జరిగే కథ అమ్మడికి బాగా నచ్చేసిందట. అయితే సినిమా మాత్రం చేయనని చెప్పేసిందట. దాంతో ఇక పెళ్లి పీటలు ఎక్కబోతుందని ప్రచారం మొదలైంది.

అంతేకాకుండా సినిమా రంగం వ్యక్తిని కాకుండా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుందని పుకార్లు వచ్చాయి. సంబంధం మాట్లాడుకోవటం ప్రాధమికంగా జరిగిపోయిందని.., అన్నీ ఓకే అయితే త్వరలోనే పెళ్లి అని కొందరు ప్రచారం చేశారు. దీంతో కెరీర్ ఇంకా ఉందని, ఇప్పట్లో పీటలు ఎక్కబోదని ఆమె మేనేజర్ సెలవిచ్చాడు. ఇది అభిమానులకు శుభవార్తే.. ఇంకొన్నాళ్లు స్వీటీ సినిమాల్లో నటిస్తుందన్న విషయం తెలిసి వారు పండగ చేసుకుంటున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka marriage  anushka  tollywood  latest news  

Other Articles