Pawan fans problematic to chiranjeevi family

chiranjeevi, pawan kalyan, chiranjeevi family, chiranjeevi daughter, chiranjeevi affair, chiranjeevi movies, chiranjeevi 150 movie, pawan kalyan, pawankalyan movies, pawankalyan marriage, pawankalyan latest, pawankalyan family, govindudu andarivadele, govindudu andarivadele audio release, govindudu andarivadele songs, govindudu andarivadele audio release photos, govindudu andarivadele release date, ram charan tej, tollywood, latest news

chiranjeevi facing some problem with pawan kalyan fans when they comes to audio functions : pawan kalyan fans shouting in mega family events brings new problems to chiranjeevi

చిరు ఫ్యామిలీకి పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది తప్పటం లేదా..?

Posted: 09/18/2014 11:51 AM IST
Pawan fans problematic to chiranjeevi family

చిరంజీవికి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అదే ఇంటిపోరు. అంటే ఇంట్లోని సమస్యలు కావు. తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల వస్తున్న ఇబ్బందులు. పవన్ ఫ్యాన్స్ వల్ల చిరంజీవి ఫ్యామిలికి వస్తున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒకప్పుడు ఎవరైతే కావాలనుకుంటున్నారో.., వారినే చిరు ఫ్యామిలి ఇప్పుడు పక్కనబెడుతోంది. అయినా సరే వారి నుంచి ఇబ్బందులు తప్పటం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాన్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, ఈ మద్య అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలి నుంచి నటులు పుట్టకొస్తూనే ఉన్నారు. ఇంతకుముందు చిరంజీవి ఫ్యాన్స్ ఉండగా.., వీరంతా పుట్టుకురావటంతో అందరి ఫ్యాన్స్ కలిపి మెగా ఫ్యామిలి ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఫ్యామిలీ హీరోల ఏ కార్యక్రమం జరిగినా మెగా ఫ్యాన్స్ అంతా రావటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా రావటం వల్ల ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు ఇండస్ర్టీలో సత్తాను చాటుకోవటం.. సినిమా విడుదలయ్యాక ఎక్కువ పేరు రావటం వంటి ప్రయోజనాలు వచ్చాయి. వీటిని ముందుగా మెగా ఫ్యామిలి స్వాగతించింది. అయితే కొద్ది కాలంగా పవన్ ఫ్యాన్స్ అల్లరి కాస్త పెరిగింది. అంటే చిరు కుటుంబం కార్యక్రమాలకు వారు వచ్చి సైలెంట్ గా కూర్చుని ఆనందించకుండా.. సభలో పవన్ కోసం కేకలు పెట్టడం మొదలు పెట్టారు. అంటే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు వచ్చి పవన్ కళ్యాణ్ రావాలని నినాదాలు చేసేవారు. ఆడిటోరియం అంతా పవర్ స్టార్ పేర్లతో హోరెత్తేది. దీంతో ఇది మొదటికే మోసం తెస్తుందని అల్లు అరవింద్ గ్రహించి చిరంజీవిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

‘రచ్చ’ సినిమా కార్యక్రమం సందర్బంగా పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ కోసం కేకలు పెట్టడంతో పాటు మెగాస్టార్ ప్రసంగిస్తుండగా స్టేజిపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కొందరు స్టేజిపైకి కాగితాలు విసిరేశారు కూడా. ఈ పరిణామాలతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పవన్ అభిమానులను వేడుకలకు దూరం పెడుతూ వస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పాసులు ఇవ్వటం మానేశారు. అయితే ఎలాగోలా పాసులు సంపాదించుకుని మెగా కార్యక్రమాలకు వస్తున్న పవన్ ఫ్యాన్స్ ఈవెంట్లలో పవన్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎంత జాగ్రత్త పడ్డా.., ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదల రోజున పవన్ పేరు మారుమోగటం అందరికి తెలిసిందే. చిరంజీవి మాట్లాడే సమయంలో అయితే ఆయన పడ్డ ఇబ్బంది మామూలుగా లేదని సన్నిహితులు చెప్తున్నారు. ఫ్యాన్స్ ఒత్తిడి తట్టుకోలేకనే సినిమా 150 రోజు వేడుకలకు తమ్ముడు వస్తాడు అని ప్రకటన చేసి వారిని చల్లబరిచారు.

అయితే భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే చిరంజీవి ఫ్యామిలికి ఫాలోయింగ్ పరంగా ఇబ్బంది తప్పదు. చిరంజీవి సినిమాలు తీసిన సమయంలో అంతా చిరు ఫ్యాన్స్ గా ఉన్నారు. ఇదే సమయంలో పవన్ సినిమాలు రావటంతో పాటు మెగాస్టార్ సినిమాలు తగ్గాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఒకటిగానే ఉన్నా పవన్ వైపు ఎక్కువ ఆసక్తి చూపారు. ఆ తర్వాత వచ్చిన వారు ఎవరూ అంతగా క్రేజ్ సంపాదించలేకపోయారు. ఈ మద్య వచ్చిన ఫ్యాన్స్ విభజన జరిగితే లాభపడేది పవర్ స్టార్ అయితే నష్టపోయేది చిరంజీవి ఫ్యామిలి హీరోలు అని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

దీన్నిబట్టి వారు ఫ్యాన్స్ ను, పవర్ స్టార్ ను దూరం పెట్టడం కంటే కలుపుకుపోవటం ఉత్తమంగా తెలుస్తోంది. చిరంజీవికి సినిమాల చివరి సమయంలో కాస్త ఇబ్బందికర పరిణామాలే ఎదురయ్యాయి. అటు పొలిటికల్ లైఫ్ లోకూడా అవే రిపీట్ అయ్యాయి. అయితే పవన్ కు ఈ రెండు ప్లస్ అయ్యాయి. సినిమాలు ఫ్యాన్స్ ను సంపాదిస్తే.. రాజకీయ పార్టీ, ప్రసంగాల ద్వారా ప్రజల్లో మద్దతు పొందారు. చిరంజీవి ఎక్కడైతే పొగొట్టుకున్నాడో పవన్ అక్కడే సంపాదించుకున్నాడు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : govindudu andarivadele  pawankalyan  chirajneevi  latest news  

Other Articles