Kamal hasan responded on his health condition

kamal hasan, kamal hasan movies, kamal hasan wiki, kamal hasan images, kamal hasan latest movies, kamal hasan family, sruti hasan, viswaroopam, paapanashanam, tamil movie, kamal hasan hospitalised, apollo hospitals, chennai apollo hospital, tollywood, koliwood, maliwood, latestnews

kamal hasan came to media about his health condition : famous actor kamal hasan says about his health condition its just of food poison now he is out of danger and getting ready for shooting

కమల్ హెల్త్ అప్ డేట్

Posted: 09/17/2014 12:27 PM IST
Kamal hasan responded on his health condition

ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు, ఊహాగానాలను నటుడు కమల్ హాసన్ తోసిపుచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని వివరణ ఇచ్చారు. కేవలం కలుషిత ఆహారం తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రిలో చేరానని.., ప్రస్తుతం ఏ ఇబ్బంది లేదన్నారు. కేరళలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ జరగటంతో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు.. రోడ్డు పక్కన దొరికే ఆహారం తీసుకోవటం వల్ల ఇబ్బంది పడ్డామన్నారు. నీరుకూడా సరిగా లభించకపోవటంతో డీహైడ్రేషన్.., కలుషిత నీరు తాగటం వల్ల అనారోగ్యం కలిగిందని చెప్పారు.

అంతమాత్రానికే తనకేదో జరిగిపోయిందన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారనీ.., తన ప్రకటన వారిని నిరుత్సాహపరుస్తుందని చెప్పారు. ఫుడ్ పాయిజన్ తో కమల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం జాయన్ అయ్యారు. వైద్యులు పలు పరీక్షలు చేసి ఏ ప్రమాదం లేదని మంగళవారమే చెప్పారు. అయితే విశ్వవిఖ్యాత నటుడికి నరాల వ్యాధి రావటం వల్ల ఆస్పత్రి పాలయ్యారని ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అభిమాన నటుడికి ఏమి కాకుడదని పలువురు పూజలు చేశారు.

తెలుగు, మళయాళంలో విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాను తమిళంలో కమల్ హాసన్ నటుడుగా తీస్తున్నారు. దీనికి ‘పాపనాశనం’ అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అయితే కమల్ అనారోగ్యం కారణంగా మంగళవారం సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా పడింది. తిరిగి పూర్తిగా కోలుకుని కేరళకు వెళ్తే షూటింగ్ మళ్లీ మొదలవుతుందని సినిమా యూనిట్ వర్గాలు అంటున్నాయి. తమిళంలో కూడా ఈ సినిమా మంచి హిట్ సాధిస్తుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ ధీమాగా ఉన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hasan  hospitalised  health update  latest news  

Other Articles