Govindudu andarivadele movie trailer out

govindudu andarivadele movie, govindudu andarivadele movie trailer, govindudu andarivadele moive teaser, govindudu andarivadele movie news, govindudu andarivadele movie photos, govindudu andarivadele movie trailers, govindudu andarivadele movie audio function, govindudu andarivadele movie song teasers, govindudu andarivadele movie review, govindudu andarivadele movie telugu review

govindudu andarivadele movie trailer out : Finally megapowerstar ram charan and krishna vamsi combo movie govindudu andarivadele trailer out on the vacation of it's audio function

కలర్ ఫుల్ ట్రైలర్ తో ‘‘గోవిందుడు’’ వచ్చేశాడు!

Posted: 09/16/2014 10:25 AM IST
Govindudu andarivadele movie trailer out

(Image source from: govindudu andarivadele movie trailer out)

ఫ్యామిలీ కథాచిత్రాలను తెరకెక్కించడంతో మకుటంలేని మహారాజుగా నిరూపించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ... ఈసారి మాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో జతకట్టిన విషయం అందరికీ తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్స్ రిలీజ్ అయ్యాయి. అప్పటికే అవి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. టీజర్ లోనే వంశీ తన మార్కును చాటుకోగా.. చరణ్ సరికొత్త రూపంలో కనువిందు చేశాడు. ఇందులో ప్రకాష్ రాజ్ తాతయ్యగా, శ్రీకాంత్ బాబయ్యగా, శ్రీకాంత్ కు జంటగా కమిలినీ, చరణ్ కు జంటగా కాజల్ నటిస్తున్నారు. ఇక, సోమవారం (15-09-2014) ఎంతో ఘనంగా ఆడియో వేడుకను జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ను వీక్షించిన అనంతరం తెలిసిందేమిటంటే.. మరోసారి కృష్ణవంశి తనదైన శైలిలో రంగుల కోటలా మొత్తం సినిమానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రంగురంగుల బ్యాక్ డ్రాప్ తో కుటుంబకథాచిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో.. రామ్ చరణ్ లండన్ నుంచి ఇండియాలోని తన తాతమ్మ దగ్గరకు చేరుకుంటాడు. మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ లోనే వుంటుంది కానీ.. తరువాత ఇంట్లో వున్న లేడీ గ్యాంగ్ అంతా అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. ఆ క్రమంలోనే శ్రీకాంత్ ఇతడు వారితో ఒక సభ్యుడిలా చేరిపోయి.. చరణ్ ఇప్పటివరకు కనబరచని తన నటిస్వరూపాన్ని ప్రదర్శించేశాడు. ఇక కాజల్ అచ్చతెలుగు ఆడపడుచు గెటప్ లో తన అందాలను బాగానే ఒలకబోసేసింది. గోవిందుడితో ఈమె లీలలు అదిరిపోయే రేంజిలో వున్నాయని ట్రైలర్ లోనే తెలిసిపోతోంది.

ఒక్క ట్రైలర్ లోనే ఫ్యామిలీ కథాచిత్రానికి వుండాల్సిన హంగులన్నీ దర్శకుడు చూపించేశాడు. దీంతో ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. ఖచ్చితంగా ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలుకొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాకోసం వెయిట్ చేస్తున్నారు. మరి అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. చరణ్ కెరీర్ ని ఏ విధంగా మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే!

గోవిందుడు అందరివాడేలే ఆడియో లాంచ్ స్టిల్స్

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles