I movie teaser released

i movie, i movie teaser, i movie audio function, i movie news, i movie trailer, i movie songs, i movie audio juckbox, i movie news, i movie trailers, i movie teasers, i movie songs teasers, i movie news, chiyan vikram, tamil director shankar, director shankar, amy jackson, arnold

I movie teaser released : Finally I movie teaser released on the vacation of its audio function which is directed by the commercial director shankar

హాలీవుడ్ రేంజికి మించిన ‘ఐ’ టీజర్!

Posted: 09/16/2014 10:03 AM IST
I movie teaser released

ఇండియన్ పరిశ్రమలో కమర్షియల్ చిత్రాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తమిళ దర్శకుడు శంకర్... తాజాగా ‘‘ఐ’’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! సుమారు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్నారు. ఇందులో విక్రమ్ దాదాపు 60 గెటప్ లలో కనిపించనున్నాడని ఇదివరకే శంకర్ ప్రకటించాడు. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న రవిచంద్రన్... ఈ మూవీ ఆడియో వేడుకను 7 కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహించాడు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ను విచ్చేసిన సంగతి విదితమే! ఈ ఫంక్షన్ సందర్భంలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.

‘‘ఐ’’ మూవీ టీజర్ ను చూస్తుంటే.. ఈసారి శంకర్ మునుపటికంటే హద్దులు లేకుండా దూసుకుపోయాడని తెలుస్తోంది. ఒక రోబోతో లవ్ యాంగిల్ సినిమా తెరకెక్కించి ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడిని మొదలుపెట్టిన ఈ డైరెక్టర్.. ఈసారి ఒక కురూపీతో వున్న విక్రమ్ చేత అదే లవ్ గేమ్ ఆడించబోతున్నాడని ఈ టీజర్ ను గమనిస్తే తెలుస్తోంది. హాలీవుడ్ తరహాలో గ్రాఫిక్స్, మేకప్, బ్యాక్ గ్రౌండ్ వంటివన్ని ఎఫెక్ట్ లు అదిరిపోయే రేంజిలో వున్నాయి. ఇండియాలో ఇంతవరకు ఏ మూవీలేని విధంగా దీనిని శంకర్ సరికొత్త యాంగిల్ లో చిత్రీకరించేసినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా బడ్జెట్ పెట్టిన దానికంటే రెండింతలు ఎక్కువగానే ఈ మూవీ కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు టీజర్ ను బట్టే అంచనాలు వేస్తున్నాయి. ఎందుకంటే.. టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే 10,20,000 మంది వీక్షించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.

"ఐ" మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్
"ఐ" మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్

"" మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్

AS

"ఐ" మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  director shankar  amy jackson  oscar ravichandran  arnold  

Other Articles