Renudesai says no need for her to use pawan name

renu desai, renu desai movies, renu desai hot, renu desai son, renu desai marriage, renu desai pawan kalyan divorce, renu desai pawan kalyan marriage, renu desai comments, pawan kalyan, power star, pawan kalyan

renudesai finally responds on comments of she using pawan name for publicity stunt : iam first heroine and self populered so i have no need of using one's name for publicity says renu desai

ఫ్యాన్స్ పై ట్విట్టర్లో సంచలన కామెంట్లు

Posted: 09/15/2014 01:33 PM IST
Renudesai says no need for her to use pawan name

పవన్ అభిమానులకు రేణు దేశాయ్ షాక్ ఇచ్చింది. తన పాపులారిటీ వాడుకుంటున్నట్లు వస్తున్న వార్తలకు సమాధానం చెప్పింది. తరుచుగా ప్రచారం కోసం పవన్ జపం చేస్తున్నట్లు విమర్శలు రావటంతో ఘాటుగా స్పందించింది. ఒకరి పేరు తన పాపులారిటీ కోసం వాడుకోవల్సిన అవసరం లేదని ప్రకటించింది. పవర్ స్టార్ ను పెళ్లి చేసుకోకముందే తాను హీరోయిన్ అని.., ఫేమస్ మోడల్ అని స్పష్టం చేసింది. అలాంటి తనకు ఒక స్టార్ పేరు ఉపయోగించుకుని పైకి రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

అభిమానం మీ దగ్గరే పెట్టుకోండి

తనపై వరుసగా వస్తున్న కామెంట్లపై ట్విట్టర్ అకౌంట్ లో సమాధానం ఇచ్చింది. గత సంవత్సరం ఎవరి సహాయం లేకుండానే సినిమా తీసి హిట్ సాధించాననీ.., అలాంటి తనకు ప్రచారం కోసం మరొకరి పేరును వాడుకునే పరిస్థితి ఎందుకు వస్తుందని విమర్శకులను ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంటే మంచిదని.., అందుకు తాను సంతోషిస్తానని అయితే ఈ అభిమానం ఇతులను ఇబ్బంది పెట్టేలా ఉండరాదని సున్నితంగా హెచ్చరించింది. పవన్ ను తాను వాడుకుంటున్నట్లు సందేశాలు పెట్టి తనను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరింది.

ట్విట్టర్ పోస్ట్ అంతా పవన్ ఫ్యాన్స్.., తనపై విమర్శలు చేస్తున్నవారిని ఉద్దేశించే రేణు కామెంట్లు చేసింది. తనపై విమర్శలు, కామెంట్లు చేసేందుకు ఉపయోగించే సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే ఎవరైనా బాగుపడతారు అని సూచించింది. ఇకపై తనపై విమర్శలు, పవన్ పేరుతో కామెంట్లు చేస్తే బాగుండదు అనే అర్ధం వచ్చేలా సందేశం పోస్ట్ చేసింది. దీంతో విడిపోయినా పాపులారిటీని మాత్రం వాడుకుంటుందని వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్లయింది. ఇప్పుడి కామెంట్లపై టాలీవుడ్ తో పాటు పవన్ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రేణు ఎందుకు ఎలా కామెంట్ చేసిందా అని వారంతా చర్చించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ పెళ్లి చేసుకుని... ఆ తర్వాత పలు కారణాలతో విడిపోయారు. స్నేహపూర్వక వాతావరణంలోనే తాము విడిపోయినట్లు పలుసందర్బాల్లో రేణు స్వయంగా ప్రకటించింది. కొడుకు అకిరా నందన్ తో కలిసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయింది. విడిపోయిన తర్వాత కొద్దికాలం ఖాళీగా ఉండి.., డైరెక్టర్ గా సినిమాలు తీయటం మొదలు పెట్టింది. విడిపోయిన తర్వాత కూడా తనకు పవర్ స్టార్ అంటే అభిమానం అని, ఆయన చెప్పే మాటలు ఉత్తేజం కల్గిస్తాయని చెప్పింది.  ఈ మద్య ఈ అభిమానం మరింత పెరిగిపోయింది. పవన్ పై కామెంట్లు చేస్తూ తరుచుగా టాలివుడ్ నోట్లో నానుతూ వచ్చింది. తాను తీస్తున్న తాజా చిత్రం ‘‘ఇష్క్ వాలా లవ్’’ టీజర్ ను పవన్ పుట్టినరోజున రోజున విడుదల చేసింది.

ఇన్నాళ్లు ఇదంతా పవన్ పాపులారిటీ వీడుకునేందుకే రేణు చేసిందని అభిమానులు అనుకున్నారు. అయితే తనకు పవన్ పాపులారిటీ అవసరం లేదని.., ఒకరి పేరు వాడుకునే పరిస్థితి ఇంకా రాలేదని చెప్పి.., చెంప చెల్లుమనిపించినంత పని చేసింది. పవన్ పేరుతో అంతా పెద్దవుతుంటే.., రేణు మాత్రం ఇలా ఎందుకు కామెంట్ చేసిందా అని సినీ వర్గాలు అంటున్నాయి. అటు తెలుగులో గనక రేణు సినిమాలు వస్తే.., కామెంట్లను గుర్తుంచుకుని మరి పవన్ ఫ్యాన్స్ ప్రతాపం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renudesai  pawankalyan  tollywood  latest news  

Other Articles