Director raghavendhra rao doctorate issue become serious

raghavendra rao, raghavendra rao movies, raghavendra rao wiki, raghavendra rao doctorate, honorary doctorate, gitam university, gitam university courses, andhrapadesh universities, telangana universities, universities in india, ph,d, latest news, tollywood news

director raghavendra rao doctorate issue become seroius with positive and negative comments from film personalities : some of famous film makers feels happy on doctorate to raghavendra rao and some feels un happy over this issue

దర్శకేంద్రుడు డాక్టరేటుకు అర్హుడా..? కాదా..?

Posted: 09/15/2014 11:16 AM IST
Director raghavendhra rao doctorate issue become serious

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు గౌరవ డాక్టరేటుపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. రాఘవేంద్రరావుకు డాక్టరేటు రావటంపై కొందరు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇది తగిన గౌరవం అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. రాఘవేంద్ర ఈ గౌరవం పొందేందుకు ఏ మాత్రం అర్హుడు కాదంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు వచ్చి రెండ్రోజులైనా పూర్తికాకుండానే ఇలా గౌరవంపై రచ్చ జరుగుతుండటంతో రాఘవేంద్రుడికి అసలు ఈ గుర్తింపు కరెక్టా.., కాదా అనే విషయం చర్చకు వచ్చింది.

ఈనెల 13న గీతం యునివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు యునివర్సిటీ గౌరవ డాక్టరేటులు ఇచ్చింది. అలా దర్శకేంద్రుడు బి.రాఘవేంద్రరావుకు కూడా డాక్టరేటు ఇచ్చింది. సినిమా, కళల విభాగంలో ఆయన చేసిన విశేష కృషికి మెచ్చి ఈ గౌరవ హోదాను అందించినట్లు యునివర్సిటీ పేర్కొంది. అయితే ఇప్పుడీ బిరుదుపై వివాదం చెలరేగుతోంది. నిర్మాత మురారి సహా పలువురు ప్రముఖులు రాఘవుడికి డాక్టరేటు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఈ హోదాకు తగిన వ్యక్తి కాదంటున్నారు. గౌరవ డాక్టరేటు అందుకునేందుకు దర్శకేంద్రుడు అర్హుడు కాదని నిర్మాత మురారీ అన్నారు. తెలుగు సినిమాకు ఇతరులతో పోలిస్తే ఆయన చేసిన గొప్ప సేవలు ఏమి లేవన్నారు.

రాఘవేంద్రరావు స్వలాభం కోసమే సినిమాలు తీశారని.., ఆయనకు సంబంధించి మురారి పలు ఆరోపణలు చేశారు. అటు పలువురు ప్రముఖులు కూడా రహస్యంగా ఈ ఆరోపణలను సమర్ధించారు కాని మీడియా ముందుకు రావటానిక ఇష్టపడలేదు. దర్శకేంద్రుడి సినిమాల ఎంపిక, మ్యూజియం కోసమని స్థలం తీసుకుని సినిమ్యాక్స్ కట్టి డబ్బులు దండుకుంటున్న వ్యవహారాలతో పాటు ఇతర అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తి విశేష సేవకుడుగా డాక్టరేటు పొందేందుకు ఎలా అర్హుడు అవుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలు ఇండస్ర్టీలో సంచలనానికి దారి తీశాయి.

అటు ఇదే సమయంలో పలువురు రాఘవేంద్రరావుకు బాసటగా నిలుస్తున్నారు. సినిమాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు రాఘవేంద్రరావు అని ఆర్.వి. గురుపాదం అన్నారు. దర్శకేంద్రుడిని విమర్శించిన మురారి ఇతర వ్యక్తుల వైఖరి సరికాదన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి వంటి సినిమాలతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన వ్యక్తుల్లో రాఘవుడు ఒకరన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హచ్చరించారు. సంవత్సరాలుగా టాలీవుడ్ కు సేవ చేస్తున్న దర్శకేంద్రుడిని కొన్ని సినిమాలు తీసిన మురారి వంటి వ్యక్తులు విమర్శించటం సరికాదన్నారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలతో రాఘవేంద్రుడి డాక్టరేటుపై రచ్చ జరుగుతోంది. మరి చివరకు ఈ వివాదం ఎటు వెళుతుందో చూద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghavendra rao  doctorate  gitam university  latest news  

Other Articles