Shankar i movie title changed in telugu version

director shankar, I movie News, Ai movie news, Ai movie title, I movie title issue, manoharudu movie news, manoharudu movie stills, shankar manoharudu movie, arnold schwarzenegger, jackie chan, chiyan vikram, amy jackson

shankar I movie title changed in telugu version

శంకర్ ‘‘ఐ’’ టైటిల్ మారిపోయింది!

Posted: 09/15/2014 10:30 AM IST
Shankar i movie title changed in telugu version

ఇండియన్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్... మరో ప్రతిష్టాత్మక కథతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘ఐ’’! ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్లు అందరినీ నుంచి మంచి ఆదరణ పొందడంతోపాటు అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా.. అనుకోకుండా ‘‘ఐ’’ టైటిల్ ని మార్చేశారు. అయితే.. ఈ టైటిల్ మారింది తమిళ వెర్షన్ లో కాదులెండి.. తెలుగు వెర్షన్ లో కొద్దిగా మార్పు చేశారు!

తెలుగులో మొదటి ఈ సినిమాకు ‘‘మనోహరుడు’’ అని నిర్ణయించిన విషయం తెలిసిందే! అయితే.. ఇప్పుడు అలా కాకుండా ఇందులో కొద్దిగా మార్పు చేశారు. తెలుగులో కూడా ‘‘ఐ’’ అనే టైటిల్ నే వుంచుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్నా సమాచారం! కాకపోతే, ట్యాగ్ లైన్ గా ‘‘మనోహరుడు’’ అనే పేరును అలాగే వుంచుతున్నారని పేర్కొంటున్నారు. ఎందుకంటే... అన్ని భాషల్లో ఈ మూవీ ‘‘ఐ’’ టైటిల్ తోనే బాగా పాపులర్ కావడం వల్లే ఇలా తెలుగులో కూడా అదే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

విక్ర, అమీ జాక్సన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. 180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీగానే నిర్మాతలు ఖర్చుపెడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ మూవీ ఆడియోకు హాలీవుడ్ ప్రముఖనటుడు ఆర్నాల్డ్ ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. సోమవారం (15-09-2014) నాడు ఈ మూవీ ఆడియో వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అలాగే.. హైదరాబాద్ లో జరగబోయే ఈ ఆడియో వేడుకకు జాకీచాన్ కూడా హాజరు కానున్నట్టు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director shankar  I movie  manoharudu  chiyan vikram  amy jackson  

Other Articles