Mahesh babu visits ajmer dargah

mahesh babu, mahesh babu latest news, mahesh babu news, mahesh babu ajmer dargah, mahesh babu special poojas, mahesh babu aagadu, aagadu movie, aagadu movie news, aagadu movie review, aagadu movie unit team, tamanna bhatia, tamanna latest photos

mahesh babu visits ajmer dargah : tollywood prince mahesh babu visits ajmer dargah for the success of his latest movie aagadu

అజ్మీర్ దర్గాలో సందడి చేసిన మహేష్ బాబు!

Posted: 09/13/2014 12:46 PM IST
Mahesh babu visits ajmer dargah

‘‘దూకుడు’’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీనువైట్ల, మహేష్ బాబు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘‘ఆగడు’’! ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీత డైరెక్టర్ గా వ్యవహరించాడు. సుమారు 55 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 14 రీల్స్ సంస్థ ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఇందులో భాగంగానే మూవీని ప్రమోట్ చేయడంకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడకుండా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద పోస్టర్లను సైతం విడుదల చేస్తున్నారు. 100 కోట్ల క్లబ్ లోకి ఈమూవీని చేర్పించాలనే ఆశతోనే నిర్మాతలు పబ్లిసిటీ కోసం ఎక్కువ ఖర్చి చేసేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లు, మహేష్ బాబు కామెడీ పంచ్ డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. దీంతో ఈ మూవీ ఘనవిజయం సాధించడం ఖాయమని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుండగా... మహేష్ బాబు కూడా ఈ మూవీ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్న మహేష్... తాజాగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేకంగా దర్శించుకున్నాడు. ఇతనితోపాటు కొంతమంది యూనిట్ సభ్యులు కూడా అక్కడికి వెళ్లారు. దర్గాలో చేయాల్సిన పూజా కార్యక్రమాలన్ని ముగించుకుని... తన సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలంటూ దేవుడిని కోరుకున్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా మహేష్ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టాలనే కసితో వున్నాడంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. మహేష్ అజ్మీర్ లో కనిపించి.. అందరినీ చమత్కరించేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  aagadu movie  tamanna bhatia  ajmer dargah  

Other Articles