Power star pawan kalyan suggestions to mega fans

power star pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan fans, megastar chiranjeevi, chiranjeevi latest news, chiranjeevi with pawan kalyan, pawan kalyan latest press meet, pawan kalyan janasena

power star pawan kalyan suggestions to mega fans

మెగాభిమానుల చీలకపై పవన్ కామెంట్లు... గబ్బర్ సింగ్ నిర్ణయాలు!

Posted: 09/13/2014 11:39 AM IST
Power star pawan kalyan suggestions to mega fans

‘‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ టాలీవుడ్ లో సెన్సేషన్ గా నిలిచిపోయింది. అయితే ఆ డైలాగ్ కు తగ్గట్టే పవన్ కూడా తన వ్యక్తిగత జీవితంలో ఇప్పిటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం! అందుకు నిదర్శనంగా ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ పెద్ద షాక్ కే గురిచేసిందనే చెప్పుకోవాలి. ఆ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఈమధ్య మీడియాలో మెగాభిమానుల మధ్య చీలికలు వచ్చేశాయంటూ ఎన్నో వార్తాకథనాలు వచ్చిన విషయం తెలిసిందే! ఇటీవలే తిరుపతిలో జరిగిన చిరంజీవి అభిమాన సంఘాల కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలవ్యాప్తంగా వపన్ అభిమానులకు పిలుపు రాకపోవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం! అంతేకాదు.. తమకు ఆహ్వానం అందకపోవడంతో అవమానకరంగా భావించిన పవన్ ఫ్యాన్స్... ఈ నెలాఖరులోగా విజయవాడలోగానీ, రాజమండ్రిలోగానీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలో పవన్ అభిమాను సంఘాలను స్థాపించాలన్న ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చిరు-పవన్ అభిమానుల మధ్య చీలీక ఏర్పడిందని తెగ వార్తలు వచ్చేశాయి.

ఇదిలావుండగా... మెగాభిమానుల మధ్య చీలిక వచ్చిందన్న విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా ఆయన షాకింగ్ కామెంట్లు ఇచ్చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేయనున్న సమావేశానికి ఆయన మద్దతు పలుకుతాడని భావించిన తరుణంలో అందుకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పారు. మెగాభిమానులు రెండు వర్గాలుగా చీలిపోవడం ఏమాత్రం ఇష్టపడని పవన్ కల్యాణ్.. దీనిపై తీవ్ర అసంతృప్తితో వున్నారని సమాచారం! దాంతో ఆయన మెగాభిమానులు ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు వర్గాలు చీలిపోకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అభిమానులందరూ చీలిపోకుండా కలిసే వుండాలంటూ పవన్ సూచనలను జారీ చేసినట్లు తెలుస్తోంది.

తనకూ, తన అన్న చిరు మధ్య రాజకీయంగా అభిప్రాయబేధాలు వున్నప్పటకీ.. దానివల్ల మెగాభిమానులు రెండు వర్గాలు చీలిపోవడం అవసరం లేదని పవన్ తన సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే.. తన పేరుమీద రాష్ట్రస్థాయిలో ‘‘పవన్ యువసేన’’ అనే పేరుతో ప్రత్యేకంగా సంఘాలను ఏర్పాటు చేయవద్దని.. అలాంటి సంఘాలకు తన మద్దతు వుండదని ఖరాఖండీగా స్పష్టం చేసినట్లు సమాచారం! చిన్నచిన్న గొడవలు, అవమానాలు ఎదురైనా వాటిని సర్దుకునిపోవాలని.. అంతేకానీ ప్రత్యేకంగా తన పేరుమీద సంఘాలు పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలని పవన్ తన అభిమానులకు సూచించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chiranjeevi  mega fans  janasena party  

Other Articles