Pawan kalyan upset over split of fans

pawan kalyan, pawanism, pawan kalyan movies, janasena, pawan kalyan speech, pawan kalyan comments on kcr, chiranjeevi, chiranjeevi fans, mega star, powerstar, pawankalyan fans, mega family fans, ram charan tej, allu arjun, latest film news, tollywood, pawan kalyan marriages

power star pawan kalyan get upset over split between pawankalyan fans and chiranjeevi fans : mega family worried about fans split and waiting for pawan kalyan response on the issue

ఫ్యాన్స్ విభజనపై పవన్ అసంతృప్తి..?

Posted: 09/12/2014 09:52 AM IST
Pawan kalyan upset over split of fans

రాష్ట్ర విభజనను చూశాం కానీ ఇప్పుడు ఫ్యాన్స్ విభజన కూడా జరుగుతోంది. తెలుగు రాష్ర్టాలు రెండు ముక్కలయినట్లుగా.., మెగా ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోతున్నారు. మెగాఫ్యాన్స్ ఇకపై చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గా వేర్వేరుగా కన్పించనున్నారు. రాష్ర్ట విభజనపైనే ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత ఇంటిలో జరుగుతున్న విభజనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులు రెండుగా విడిపోవటం ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. మెగా విభజనపై పవన్ స్పందించకపోయినా.., సన్నిహతుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తాజా ఘటన పవర్ స్టార్ ను బాధించిందట.

రాజకీయాలు, సినిమాలు.., ఇటీవలి పరిణామాల కారణంగా మెగా ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. పవర్ స్టార్ కోసం కొందరు అభిమానులు కలిసి కొత్తగా ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో కూడా ఆందోళన మొదలయింది. ఇన్నాళ్ళు ఒక్కటిగా ఉన్న అభిమానులు ఇప్పుడు విడిపోతున్నారని కుటుంబం బాధపడుతోంది. ఫ్యాన్స్ అంతా ఒకే చెట్టుకింద ఉండటంతో మెగా కుటుంబంలోని ఏ హీరోకు సంబంధించి ఏ ఫంక్షన్ అయినా అనూహ్య స్పందన వచ్చేది. అంతా ఒకే కుటంబం అన్నట్లు భావించి మెగా ఫంక్షన్లకు తరలివచ్చేవారు. అయితే తాజాగా వచ్చిన విభజనతో ఎవరి కార్యక్రమాలకు వారే వెళ్తారు అనే పద్దతి ప్రారంభం కానుంది. ఇది ఇండస్ర్టీలో వారికి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ ను దెబ్బతీయనుంది.

ఇప్పటి వరకు ఈ విభజనపై పవన్ స్పందిచలేదు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న కళ్యాణ్ హైదరాబాద్ వస్తే., ఈ వివాదంపై నోరువిప్పే అవకాశముంది. పవర్ స్టార్ ఏం చెప్తారా..? ఎలా స్పందిస్తారా..? అని చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగా కుటుంబం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  fans split  chiranjeevi  latest news  

Other Articles