Kajal agarwal fires udhayanidhi stalin complaint artists association

kajal agarwal, kajal agarwal latest news, udhayanidhi stalin, kajal agarwal hot photo shoot, kajal agarwal udhayanidhi stalin, kajal agarwal bikini photos, kajal agarwal tamil producers council

kajal agarwal fires udhayanidhi stalin complaint artists association : finally kajal agarwal gives reply to udhayanidhi stalin that she will never give the money back which he was given before

పైసల్లేవ్.. స్టాలిన్ కు షాకిచ్చిన కాజల్!

Posted: 09/11/2014 01:10 PM IST
Kajal agarwal fires udhayanidhi stalin complaint artists association

ఇటీవలే తమిళ హీరో - నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తన దగ్గర కాజల్ అగర్వాల్  40 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించిందని తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం రానురాను పెద్ద దుమారంగా మారిపోతోంది. గతంలో ‘‘నన్బెండా’’ అనే తమిళ సినిమాలో కాజల్ కథానాయికగా నటించడానికి అంగీకరించిందని.. అందుకు ఆమె 40 లక్షల రూపాయలు కూడా అడ్వాన్సుగా తీసుకుందని పేర్కొన్న స్టాలిన్... తర్వాత డేట్స్ లేవంటూ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదని తెలిపాడు. దాంతో తన డబ్బులు ఆమె నుంచి తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతూ స్టాలిన్, కాజల్ పై ఫిర్యాదు చేయించాడు. దీంతో ఆగ్రహానికి గురైన కాజల్.. స్టాలిన్ కు దిమ్మతిరిగిపోయేలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన దగ్గర పైసల్లేవంటూ ఖరాఖండీగా తెలిపింది.

‘‘నన్బెండా’’ సినిమాకు తాను ముందుగానే డేట్స్ ఇచ్చానని తెలిపిన కాజల్.. ఆ సమయంలో వారు వాటిని సద్వినియోగం చేసుకోలేదని చెప్పింది. దానివల్ల అటు తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నానని తెలుపుతోంది. అందుకే.. తనకు జరిగిన ఆ నష్టానికి 40 లక్షల రూపాయలు ఇవ్వదలచుకోలేనంటూ స్టాలిన్ కు షాకిచ్చేసింది కాజల్! స్టాలిన్ వల్ల ఓ సినిమా ఆఫర్ కోల్పోయిన తాను.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ డబ్బులు తిరిగిచ్చేదిలేదంటూ మొండికేసుకున్న కాజల్.. అవసరమైతే ఈ విషయంపై ఆర్టిస్టుల సంఘంలో కంప్లైంట్ చేస్తానని హెచ్చరించేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత అగ్గిరిజుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు మాజీముఖ్యమంత్రి మనుమడు.. మరోవైపు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్.. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో..? వీరిమధ్య వివాదం ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో..? ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles